కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో తనపై భారీగా అంచనాలు పెంచిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కానీ తర్వాత ముకుంద సినిమాతో అతను నిరాశపరిచాడు. ఇక బ్రహ్మోత్సవం సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. మహేష్ బాబును హీరోగా పెట్టి టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటనదగ్గ సినిమా తీయడంతో అతడి కెరీర్ ఒక్కసారిగా కుదేలైంది.
కొన్నేళ్ల పాటు అతడికి సినిమా ఇవ్వడానికే నిర్మాతలు భయపడ్డారు. మధ్యలో రీమేక్ మూవీ నారప్పను డైరెక్ట్ చేసినా పెద్దగా ఇంపాక్ట్ వేయలేకపోయాడు. ఐతే ఇప్పుడు శ్రీకాంత్ పెదకాపు సినిమాతో పునరాగమనం చేశాడు. ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడటానికి ప్రధాన కారణం శ్రీకాంతే. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో సినిమా మీద ప్రేక్షకుల దృష్టిసారించేలా చేశాడు.
కానీ స్కంద, చంద్రముఖి-2 లాంటి మాస్ మూవీస్‌తో పోటీ పడటం, పేరున్న హీరో లేకపోవడం పెదకాపు చిత్రానికి మైనస్ అయింది. దీనికి తోడు సినిమా కూడా అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో జనాలు తొలి రోజు ఈ సినిమా థియేటర్ల వైపు పెద్దగా చూడలేదు. ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. సినిమా తర్వాత పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఐతే డైరెక్టర్‌గా శ్రీకాంత్ ఫెయిలైనప్పటికీ.. నటుడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. రావు రమేష్ కొడుకు పాత్రలో అతను ఆద్యంతం ఆకట్టుకున్నాడు.
కాళ్లు పని చేయకపోయినా.. పౌరుషానికి తక్కువ కాని పాత్రలో అతడి నటన.. డైలాగులు ప్రేక్షకుల్లో తన పాత్ర పట్ల ఆసక్తి రేకెత్తిస్తాయి. పతాక సన్నివేశాల్లో కూడా తన పాత్రకు మంచి డైలాగులు రాసుకున్నాడు శ్రీకాంత్. తమిళంలో గౌతమ్ మీనన్, ఎస్.జె.సూర్య లాంటి చాలామంది దర్శకులు నటులుగా మారి బిజీ అయిపోయారు. పెదకాపు రిజల్ట్ చూశాక అతడికి దర్శకుడిగా సినిమాలు రావడం కష్టమే కాబట్టి.. నటుడిగా ట్రై చేస్తే బాగానే క్లిక్ అవుతాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 30, 2023 11:02 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…