టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మరోసారి ఆసక్తికర పాడ్‌కాస్ట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈసారి ఆయన ఎంచుకున్న అంశం.. సెక్స్ కావడం విశేషం. వందల ఏళ్ల కిందట మన పూర్వీకులకు ఉన్న సెక్స్ విజ్ఞానం మనకు లేదని.. వాళ్లు ఆ విషయంలో ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తే మనం మాత్రం సెక్స్‌ను ఇంకా బూతులాగే చూస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సినిమాల షూటింగ్‌ల కోసం తరచుగా బ్యాంకాక్‌కు వెళ్లడం గురించి మాట్లాడారు. అక్కడ తన టీంలోని కుర్రాళ్లు ఏం చేస్తారో వివరించారు.
‘‘బ్యాంకాక్ షూటింగ్ అంటే మా యూనిట్ అందరికీ పండగ. 15 రోజుల షెడ్యూల్. వెళ్ళగానే మొదటి రెండు రోజులు మా కుర్రాళ్ళు రెచ్చిపోతారు. ఆ తర్వాత ఎక్కడికీ వెళ్లకుండా టైమ్‌కి పడుకుంటారు. ఎందుకెళ్లరంటే.. రాత్రి ఏ టైమ్ అయినా మనకు కావాలంటే అది దొరుకుతుందిలే అనే ధైర్యంతో హ్యాపీగా పడుకుంటారు. దాని తర్వాత ఇంకో కంట్రీ వెళ్తాము. ఇక్కడ వ్యభిచారం నేరం అని చెబితే చాలు ఒక్కొక్కడికి నిద్రలు పట్టవు. ఎలారా దేవుడా అని అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. రిస్ట్రిక్ట్ చేయడం వల్లనే సెక్స్ మైండ్‌లో ఇరుక్కుపోద్ది. ఇండియాలో అదే జరిగింది’’ అని పూరి వివరించాడు.
వెయ్యేళ్ల క్రితమే మన పూర్వీకులు దేవాలయాలపై శృంగార బొమ్మలు చెక్కారని.. ఇప్పుడు దేవాలయాలపై మనం అలాంటి ఒక్క బొమ్మ చెక్కగలుగుతామా అని ప్రశ్నించాడు పూరి. ఇప్పుడు సెక్స్ అంటే ఓ బూతు అని.. ఎప్పుడో సెక్స్ లిబరేషన్ గురించి మన పెద్దవాళ్లు మాట్లాడితే ఇప్పుడు మనకు సెక్స్ అనే పదం పలకాలన్నా భయపడుతున్నామని… అందుకే ఇండియాలో ఎవ్వరికీ మోక్షం రాదని.. మధ్యలోనే పోతారని.. ‘ధర్మార్థ కామ డెత్’ అని ముగించాడు పూరి.
This post was last modified on August 24, 2020 9:41 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…