బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు సినిమా థ్రిల్లర్ ను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి వ్యవహారంలో అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ ది హత్య అని…ఆ హత్యకు రియా సొంత తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, రియా షుగర్ డాడీ మహేష్ భట్ ప్లాన్ చేశారని సుశాంత్ జిమ్ పార్ట్ నర్ సునీల్ సంచలన ఆరోపణలు చేశాడు. మరోవైపు, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు…దుబాయ్ కు చెందిన ఆయుష్ ఖాన్ అనే ఓ డ్రగ్ డీలర్…సుశాంత్ ను కలిశాడని బీజేపీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఆ భేటీలో ఏం జరిగిందో విచారణ జరపాలని అన్నారు. ఇక, సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేసిన సీబీఐ…తాజాగా రియా, ఇంద్రజిత్ లకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న రియాను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ రోజు ముంబైలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో సీబీఐ ప్రత్యేక బృందం సీన్ రీ క్రియేట్ చేసింది. ఆ ఫ్లాట్ సీలింగ్ ఎత్తు..సుశాంత్ ఎత్తు…వంటి ఆధారాలు సేకరిస్తున్నారు. సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య ఎన్ని గంటలకు జరిగిందన్న దానిపై స్పష్టత లేకపోవడం, సుశాంత్ నివాసం దగ్గర్లోనే 2 హాస్పిటల్స్ ఉన్నా 5 కిలోమీటర్ల దూరంలోని కూపర్ హాస్పిటల్‌కే సుశాంత్ డెడ్‌బాడీని ఎందుకు తరలించారన్న దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ డిప్రెషన్ కు చికిత్స తీసుకున్న హిందుజా ఆసుపత్రిని సీబీఐ బృందం సందర్శించింది.
This post was last modified on August 24, 2020 8:18 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…