మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆధ్యాత్మిక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప క్యాస్టింగ్ అంతకంతా పెద్ద స్థాయికి చేరుకుంటోంది. శివ పార్వతులుగా ప్రభాస్ నయనతార ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాగా తాజాగా కేరళ సీనియర్ స్టార్ మోహన్ లాల్ ఈ బృందంలో చేరడం అంచనాలు పెంచేస్తోంది. చాలా సెలెక్టివ్ గా తెలుగు సినిమాలు చేసే లాలెట్టాన్ గత కొన్నేళ్లలో ఓకే చెప్పినవి రెండే. మనమంతా, జనతా గ్యారేజ్. మళ్ళీ కన్నప్ప సబ్జెక్టు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. పాత్ర తీరుతెన్నులు బయటికి చెప్పలేదు కానీ ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక ముఖ్యమైన క్యారెక్టరని లీక్ ఉంది.
అన్ని బాషల నుంచి నటీనటులను తీసుకోవడం ద్వారా కన్నప్ప రేంజ్ ని పెంచుతున్నారు. కన్నడ, హిందీ నుంచి ఎవరు ఉంటారనే ఆసక్తి పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్ తో ప్రాథమికంగా చర్చలు జరిగాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదని తెలిసింది. శాండల్ వుడ్ నుంచి శివరాజ్ కుమార్ తో పాటు సుదీప్ ని కూడా అడుగుతున్నారట. ఎవరినీ ఖరారు చేయలేదు. పారితోషికాల విషయంలో రాజీ పడకుండా మంచు బృందం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంది. విదేశాల్లో షెడ్యూల్ కోసం ఏకంగా ఆరు వందల మందిని తీసుకెళ్లడమే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు.
తన డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప గురించి గొప్పగా చెబుతున్న విష్ణు అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఫారిన్ లొకేషన్లలో తీస్తున్నా సరే నేటివిటీ తగ్గకుండా ఆర్ట్ డిపార్ట్ మెంట్ నుంచి బెస్ట్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. హీరోయిన్ నుపుర్ సనన్ డేట్ల ఇష్యూ వల్ల తప్పుకోవడంతో ప్రత్యాన్మయం వెతకడంలో టీమ్ బిజీగా ఉంది. మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. 2025 మహా శివరాత్రికి విడుదల చేసే లక్ష్యంతో పని చేస్తున్నారని టాక్. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎపిక్ డ్రామాకు మణిశర్మ అందించబోయే సంగీతం ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలవనుంది.
This post was last modified on September 30, 2023 5:10 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…