మాములుగా ఒక డిజాస్టర్ పడితేనే నిర్మాతకు కోలుకోవడానికి టైం పడుతుంది. అలా అని సినిమాలు తీయడం ఆపేయడు. ఇంకా కసితో పోయిన చోటే వెతుక్కోవాలని మళ్ళీ పెట్టుబడి సిద్ధం చేసుకుంటాడు. కానీ ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు దెబ్బలు తగిలితే మాత్రం ఎంత డబ్బున్నా రికవరీ అంత సులభంగా ఉండదు. ప్రస్తుతం శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అధినేత శ్రీనివాస్ చిట్టూరిని చూస్తే అదే అనిపిస్తోంది. ఆయన తాజా చిత్రం స్కంద ఓపెనింగ్స్ వరకు బాగానే ఉన్నప్పటికీ టాక్ తీసికట్టుగా ఉండటంతో హిట్ కావడం దుర్లభమనే విషయం త్వరగానే అర్థమైపోయింది.
బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టి రామ్ కెరీర్ లోనే అత్యధిక ఫస్ట్ డే వసూళ్లు సాధించినా చివరికి దాని ప్రయోజనం అందేలా లేదు. శ్రీనివాస్ ఇంతకు ముందు తీసిన నాగచైతన్య కస్టడీ కూడా ఇంతే. వెంకట్ ప్రభు లాంటి టాలెంటెడ్ దర్శకుడితో నాగచైతన్య కాంబోని సెట్ చేసి, ఖరీదైన అరవింద్ స్వామిని విలన్ గా పెట్టినా లాభం లేకపోయింది. వారం తిరిగేలోపే టపా కట్టేసింది. రామ్ తోనే లింగుస్వామి కాంబోలో తీసిన ది వారియర్ మరో విషాద గాథ. ఆ గాయం నుంచి స్కంద కోలుకునేలా చేస్తుందనుకుంటే ఇదింకా పెద్దది చేసింది. గోపీచంద్ సీటిమార్, సమంతా యుటర్న్ అన్నీ ఒకటే ఫలితాలు.
నిజానికి శ్రీనివాస్ చిట్టూరి ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు. హీరో, డైరెక్టర్ మార్కెట్, డిమాండ్ కు మించి కోట్లు కుమ్మరించేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. దురదృష్టం కొద్దీ ఫలితాలు ఎంత మాత్రం అనుకూలంగా రావడం లేదు. కనీసం యావరేజ్ అనిపించుకునే పర్వాలేదు కానీ బాక్సాఫీస్ వద్ద కనీసం హిట్ అనిపించుకున్నవి లేకపోవడం ట్రాజెడీ. కాంబోలకన్నా స్క్రిప్ట్ మీద సీరియస్ గా విశ్లేషణ చేసుకోవడం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంత పెద్ద వాళ్ళతో తీస్తున్నా సరే జడ్జ్ మెంట్ విషయంలో ప్రొడ్యూసర్ జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివే తరచు చూడాల్సి వస్తుంది.
This post was last modified on September 30, 2023 1:54 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…