నిన్న విడుదలైన స్కందకు ముందు రోజు భీభత్సమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. చాలా ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం ఉండటంతో జనం థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. పైగా మాములుగా రామ్ సినిమాలకు ఉండే ప్రీ పాజిటివ్ వైబ్రేషన్స్ స్కందకు తక్కువగా కనిపించాయి. అయినా సరే మొదటి రోజు 18 కోట్లకు పైగా గ్రాస్ తో 8 కోట్ల 60 లక్షల షేర్ రాబట్టి బరాబర్ చూసుకుందాం అన్నట్టే వసూళ్లు రాబట్టాడు. గణేశుడి పండగతో పాటు రాజకీయ పరిణామాల దృష్ట్యా పబ్లిక్ లో ఎంటర్ టైన్మెంట్ మీద దృష్టి అంతగా లేదు. అయినా ఈ ఫిగర్లు ఆశ్చర్యమే.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. రామ్ రియల్ స్టామినా ఇంతకు మించి అని. మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చి, ముందస్తు బుకింగ్స్ నెమ్మదిగా ఉన్నా సరే ఇంత రాబట్టడం చిన్న విషయం కాదు. ఒకవేళ ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకుని ఉంటే ఇవాళ థియేటర్ల దగ్గర సీన్ వేరే స్థాయిలో ఉండేది. పూర్తిగా డ్రాప్ అవ్వలేదు కానీ సోమవారం నుంచి నెమ్మదించే దిశగానే ఆడియన్స్ టాక్ తిరుగుతోంది. బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఇంకా చాలా దూరమున్నప్పటికే నిర్మాతలు సులభంగా దాన్ని ఆదుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆ నమ్మకం నిజమైతే మంచిది కాని రామ్ కున్న మార్కెట్ పరంగా చూసుకుంటే సరైన హిట్టు టాక్ వస్తే ఈజీగా వంద కోట్ల క్లబ్బులో ప్రవేశించేలా ఉన్నాడు. డబుల్ ఇస్మార్ట్ తో అది సాధ్యమవుతుందా లేదానేది పక్కనపెడితే టయర్ 2 హీరోల్లో తన స్థానం బలంగా ఉందని మాత్రం చాటినట్టు అయ్యింది. ఒకవేళ ఆదివారం లోపు కనీసం ముప్పై కోట్ల షేర్ దాటగలిగితే నష్టాలు రాని దిశగా వెళ్లొచ్చు. బ్రేక్ ఈవెన్ 44 కోట్ల దాకా ఉంది. ఇంకా సుదీర్ఘమైన ప్రయాణం చేయాల్సి ఉంది. కాంపిటీషన్ లో ఉన్న చంద్రముఖి 2, పెదకాపు 1ల టాక్ అంతంతమాత్రంగా ఉన్న అవకాశాన్ని రామ్ ఎలా వాడుకుంటాడో చూడాలి.
This post was last modified on September 29, 2023 9:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…