నిన్న విడుదలైన స్కంద మీద మిక్స్డ్ టాక్ నడుస్తోంది. మాస్ జనాలు మాత్రం మొదటి రోజు బాగానే చూసినట్టు వసూళ్లు చెబుతున్నాయి. ఫిగర్లు రావడానికి మరికొన్ని గంటలు పడుతుంది కానీ రామ్ కెరీర్ బెస్ట్ నమోదయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. పోటీ లేకపోవడం,, గత రెండు వారాలకు పైగా బాక్సాఫీస్ డల్లుగా ఉన్న అవకాశాన్ని స్కంద వాడుకుంటోంది. రిలీజ్ కు ముందు ఉన్న కొంత నెగటివ్ వైబ్రేషన్ చూసుకుంటే ఇది మంచి స్పందనే. గురువారం వచ్చింది కాబట్టి మొత్తం నాలుగు రోజుల సుదీర్ఘమైన వీకెండ్ మంచి ఛాన్స్ ఇవ్వనుంది.
ఇక స్కంద 2 ఉంటుందని సినిమా క్లైమాక్స్ లో స్పష్టంగా చెప్పేసిన బోయపాటి శీను సెకండ్ హాఫ్ లో తలెత్తిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం పార్ట్ టూలో చెప్పాల్సి ఉంటుంది. రెండో రామ్ పాత్రకు సంబంధించి కొంచెం గందరగోళం సృష్టించి పెట్టారు. నిజంగా కొనసాగింపు ఉంటుందా అనే అది ఫైనల్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అఖండ రేంజ్ లో యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే అది వేరే సంగతి. కానీ స్కంద గురించి ఆ స్థాయిలో మాట్లాడుకోవడం లేదు. పై పెచ్చు నేలవిడిచి సాము తరహాలో ఓవర్ మాస్ చూపించారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.
స్కంద 2 క్లారిటీ రావాలంటే మంగళవారం దాకా ఆగాలి. అప్పటికంతా కలెక్షన్లు డ్రాప్ కాకుండా స్టడీగా ఉంటే హిట్టు మీద ఆశలు పెట్టుకోవచ్చు. ఇటీవలే ఖుషి మొదటి మూడు రోజులు భీభత్సంగా రాబట్టి తర్వాత హఠాత్తుగా పడిపోయి చివరికి ఫ్లాప్ గా మిగిలింది. దానికొచ్చినంత పాజిటివ్ టాక్ స్కంద దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో సీక్వెల్ అంటే అనుమానంగానే ఉంది. బోయపాటి నెక్స్ట్ లిస్టులో సూర్య, అల్లు అర్జున్, అఖండ 2 ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఏది కార్యరూపం దాలుస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేం. స్కంద 2 వచ్చేది లేనిది తేలాలంటే జస్ట్ ఇంకో నాలుగైదు రోజులు ఆగితే చాలు.
This post was last modified on September 29, 2023 10:20 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…