గత ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్ తో సంచలన విజయం నమోదు చేసుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈసారి ది వ్యాక్సిన్ వార్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సలార్ ని ఢీ కొట్టాలని ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసుకున్న ఈయనకు లక్కీగా అది పోస్ట్ పోన్ కావడంతో ఓపెనింగ్స్ పరంగా కలిసి వచ్చింది. నానా పాటేకర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ రియల్ లైఫ్ డ్రామాని కరోనా వచ్చినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. నెల రోజుల ముందు నుంచే ఓవర్సీస్ లో ప్రీమియర్లు వేసి వాటి ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ నే ప్రమోషన్ కోసం వాడుకుంటూ వచ్చారు. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే
ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ భార్గవ(నానా పాటేకర్) తన బృందంతో కలిసి న్యుమోనియా అరికట్టేందుకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉంటాడు. ఆ సమయంలో ప్రపంచం మీద కరోనా విరుచుకుపడుతుంది. మీడియాలో వార్తలతో జనం భీతిల్లుతారు. లక్షల ప్రాణాలు పోతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేషనల్ వైరాలజి ఇన్స్ టిట్యూట్ హెడ్ అబ్రహం(పల్లవి జోషి) కోవిడ్ విరుగుడు కోసం భార్గవ టీమ్ తో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తుంది. మగాళ్లే వణికిపోతున్న సమయంలో లేడీ సైంటిస్టులు నడుం బిగిస్తారు. చివరికి వీళ్ళు ఎలా విజయం సాధించారనేది అసలు కథ.
వివేక్ అగ్నిహోత్రి 2 గంటల 40 నిమిషాల సుదీర్ఘ నిడివిలో కరోనాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని, పరిణామాలను, ప్రయోగాలపై ప్రభావం చూపించిన సంఘటనలను చాలా డిటైల్డ్ గా చూపించారు. వ్యాప్తి జరగడంలో జనం, ప్రభుత్వాలు చేసిన తప్పులను ఎత్తి చూపించారు. అయితే అధికారిక బిజెపి మీద ఎలాంటి మరక రాలేదని చెప్పేందుకు స్క్రీన్ ప్లే దానికి అనుకూలంగా నడిపించడం గమనించవచ్చు. అయితే నెరేషన్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా సాగడం ఇబ్బంది పెడుతుంది. కొన్ని నమ్మలేని అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ప్రధాన బలం. తీవ్రంగా నిరాశపరిచే ప్రమాదాన్ని వ్యాక్సిన్ వార్ తప్పించుకుంది కానీ కమర్షియల్ గా పే చేయడం మీద అనుమానాలను కొట్టి పారేయలేం.
This post was last modified on September 29, 2023 10:14 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…