ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కథలు అందరికీ సెట్ కావు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు దర్శక రచయితలు అలోచించి రాసుకుంటారు. కొన్ని మిస్ కావడం బ్యాడ్ లక్ అనుకుంటే కొన్ని చేయకపోవడమే మంచిదనిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అనిమల్ స్క్రిప్ట్ ని దర్శకుడు సందీప్ వంగా ముందు మహేష్ బాబుకే వినిపించాడట. అయితే మరీ బోల్డ్ గా ఉండటం, వయొలెన్స్ ఎక్కువ కావడం లాంటి కారణాల వల్ల సున్నితంగా నో చెప్పినట్టు గతంలోనే టాక్ వచ్చింది. దాన్నే రన్బీర్ కపూర్ తో తీసి హైప్ ని పెంచడంలో సందీప్ సక్సెస్ అయ్యాడు.
టీజర్ చూశాక అనిపించేది ఒకటే. ఇలాంటి వైల్డ్ క్యారెక్టరైజేరేషన్లు మహేష్ కు అంతగా నప్పవు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. పుష్ప కూడా ముందు సుకుమార్ మహేష్ కే చెప్పడం, అడవుల్లో దుంగలు స్మగ్లింగ్ చేసే పాత్రలు తనకు నప్పవని మహేష్ తప్పుకోవడం ఫ్యాన్స్ మర్చిపోలేరు. అది కూడా సరైన నిర్ణయమే. ఎందుకంటే అల్లు అర్జున్ కి ఎంత జాతీయ అవార్డు వచ్చిన పుష్ప రాజ్ గెటప్ లో మహేష్ ని ఊహించుకోలేం. తన మాస్ స్టైల్ వేరు. పోకిరి, బిజినెస్ మెన్ తరహా అయితేనే క్లాస్ అండ్ మాస్ కనెక్ట్ అవుతారు.
ఇంకా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఏ మాయ చేశావే, గజినిలు కూడా మహేష్ దాకా వచ్చి వెనక్కు వెళ్ళినవే. ఇవి హిట్ కావడం పక్కనపెడితే సూర్యలాగా ప్రిన్స్ గుండుతో కనిపించడం మనం ఊహించుకోలేం. గౌతమ్ మీనన్ స్లో నరేషన్ కూడా తనకు నప్పదు. ఏ యాంగిల్ లో చూసుకున్నా తన డెసిషన్లు మంచి ఫలితాలే ఇచ్చాయి. అలా అని అన్ని హిట్ అయ్యాయని కాదు. స్పైడర్, బాబీ, బ్రహ్మోత్సవం, వంశీ లాంటి కథలను జడ్జ్ చేయడంలో తప్పటడుగులు పడ్డాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే మహేష్ ఏదో చాలా మిస్ అయినట్టు సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్ హడావిడి చేయడం వల్ల.
This post was last modified on September 28, 2023 10:58 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…