అక్టోబర్ లో ‘టైగర్ నాగేశ్వరరావ్’ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్న రవితేజ జనవరికి ఈగల్ ను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు మాస్ మహారాజా. మైత్రి మూవీ మేకర్స్ లో ‘క్రాక్’ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి హీరోయిన్ గా రష్మిక మందన్న ను ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలో కీ రోల్స్ కి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు గోపీచంద్.
తాజాగా తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ను కలిసి సినిమాలో కీ రోల్ ఆఫర్ చేశాడట గోపీచంద్. కేరెక్టర్ నచ్చడంతో సెల్వ రాఘవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ మధ్య విజయ్ బీస్ట్ లో మంచి కేరెక్టర్ ప్లే చేసి థియేటర్స్ లో ఎంటర్టైన్ చేశాడు సెల్వ. తమిళ్ లో ఆడదడపా రోల్స్ చేస్తూనే ఉన్నాడు. వచ్చే నెల నుండి 7g బృందావన్ కాలనీ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు సెల్వ. అటు దర్శకుడిగా ఆ సినిమా చేస్తూనే ఇటు తెలుగులో రవితేజ సినిమాకు నటుడిగా డేట్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
క్రాక్ లో తమిళ దర్శకుడు సముద్రఖని చేత మంచి విలన్ రోల్ చేయించిన గోపీచంద్ , సెల్వ రాఘవన్ ను ఈ సినిమాలో ఎలా చూపిస్తాడు ? ఎలాంటి కేరెక్టర్ డిజైన్ చేశాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి రవితేజకి సెల్వ మెయిన్ విలన్ గా ఏమైనా కనిపిస్తాడా ? లేదా క్రాక్ తరహాలాగే ఇద్దరు ముగ్గురు విలన్స్ లో ఒకడిగా కనిపిస్తాడా ? తెలియాల్సి ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ ఘాట్ మొదలు కానుంది.
This post was last modified on September 28, 2023 10:35 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…