జనాన్ని థియేటర్లకు రప్పించే విషయంలో హిందీ నిర్మాతలు పాటించే ఎత్తుగడలు బాగుంటాయి. ఇరవై రోజులు పూర్తయిపోయి దాదాపు ఫైనల్ రన్ కు దగ్గరగా ఉన్న షారుఖ్ ఖాన్ జవాన్ కు ఇవాళ్టి నుంచి వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు నిర్మాతలు. అంటే ఒక టికెట్ కొంటే మరొకటి పూర్తిగా ఉచితం. గతంలోనూ ఇలాంటి స్కీంస్ ఎన్నో పెట్టారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1కి రెండో వారంలోనే 99 రూపాయలు పెట్టడం చాలా ప్లస్ అయ్యింది. గదర్ 2కి సైతం ఇదే ఫాలో అయ్యారు. వీటి వల్ల వీక్ డేస్ లో నెమ్మదించిన వసూళ్లు అమాంతం పుంజుకున్న దాఖలాలు చాలా ఉన్నాయని బయ్యర్లు అంటారు.
ఇలాంటి పథకాలు మన తెలుగు ప్రేక్షకులకు అందిస్తే బాగుంటుంది. రిలీజైన వారంలో అక్కర్లేదు కానీ టాక్ తెలిశాక లేదా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయని అర్థం చేసుకున్నాక పెడితే ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది. నూటా యాభై రూపాయల టికెట్లు కొని పది మంది రావడం కన్నా వంద రూపాయలు టికెట్లు కొని యాభై మంది సినిమా చూడటమే లాభదాయకం. ఆ దిశగా మన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఆలోచించాలి. ఇలా చేస్తే ప్రేక్షకులను ఫస్ట్ వీక్ చూడకుండా ఆగిపోతారనే భయం అక్కర్లేదు. ముందు ఫ్లాప్ అయిన వాటికి అమలు పరిచి తర్వాత బ్లాక్ బస్టర్ల సంగతి చూసుకోవచ్చు.
స్టార్ హీరోలకు పెద్ద ఇబ్బంది లేదు కానీ ఇలాంటి ఆఫర్లు లేకపోవడం వల్ల చిన్న సినిమాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా మొదటి రోజే షోలు క్యాన్సిలవుతున్న పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది. బాగుండటం లేకపోవడం తర్వాత సంగతి. మహేష్ బాబుకి ఖర్చు పెట్టినంతే ముక్కు మొహం తెలియని హీరోలకు పెట్టమంటే ఆడియన్స్ కి మనసు రావడం లేదు. పిండి కొద్ది రొట్టె అన్నట్టు హీరో రేంజ్ కి తగట్టు ధరలు డిసైడ్ చేయడం చాలా అవసరం. లేదంటే ఛోటా ప్రొడ్యూసర్లు డెఫిషిట్లు కట్టుకుంటూ నష్టాలు లెక్కేసుకుంటూ కూర్చోవడం తప్పించి వేరే మార్గం ఉండదు. ప్రయత్నిస్తే మంచిదేమో.
This post was last modified on September 28, 2023 12:44 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…