అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లోనే కాదు దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోనూ జెండా ఎగరేసిన దర్శకుడు సందీప్ వంగా ఈసారి అనిమల్ తో రాబోతున్నాడు. రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన ఈ మాఫియా డ్రామా డిసెంబర్ 1 విడుదల కాబోతోంది. డిఫరెంట్ ట్రీట్ మెంట్, అల్ట్రా వయొలెన్స్ తో దీన్ని రూపొందించినట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. టి సిరీస్ సంస్థ రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉందీ అనిమల్. అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ పెద్దదే ఉంది. ఇవాళ రెండున్నర నిమిషాల పాటు ఉన్న టీజర్ రిలీజ్ చేశారు.
కొడుకుని క్రమశిక్షణలో పెట్టడానికి విపరీతంగా కొట్టడానికి వెనుకాడని బల్బీర్ సింగ్(అనిల్ కపూర్)నిత్యం నేర సామ్రాజ్యంలో మునిగి తేలుతూ ఉంటాడు. అయితే తండ్రి ఎంతగా దండించినా అతన్ని పల్లెత్తు మాట అనేందుకు సాహసించని యువకుడు(రన్బీర్ కపూర్) ముందు మాములు జీవితాన్ని గడుపుతాడు. అతనికో ప్రియురాలు(రష్మిక మందన్న)ఉంటుంది. అయితే సాత్వికంగా ఉండే అతడు కొన్ని పరిణామాల తర్వాత జంతువుగా మారిపోయి శత్రువులను వేటాడటం మొదలుపెడతాడు. చివరి లక్ష్యాన్ని చేరుకుంటాడు. అక్కడిదాకా ప్రయాణం ముళ్ళమధ్య సాగుతుంది. అదే అసలు స్టోరీ.
సందీప్ వంగా తనదైన శైలిలో స్క్రీన్ ప్లే నడిపించినట్టు కనిపిస్తుంది. కథకు సంబంధించి క్లూస్ ఎక్కువగా ఇవ్వకపోయినా మెయిన్ లైన్ ఏంటో చెప్పేశారు. బారుడు గెడ్డంతో వెనుక సింగ్ గ్యాంగ్ తో మెషీన్ గన్లు పట్టుకుని యుద్ధానికి వెళ్తున్న రేంజ్ లో చూపించిన సీన్స్ లో మంచి ఎలివేషన్లు కనిపిస్తున్నాయి. మెయిన్ ఆర్టిస్టులను తప్ప మిగిలినవాళ్ళను రివీల్ చేయలేదు. ఇది టీజర్ కాబట్టి అసలు ట్రైలర్ లో బోలెడు కంటెంట్ చూపించే ఛాన్స్ ఉంది. స్టైలిష్ మేకింగ్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాడని పేరున్న సందీప్ వంగా రన్బీర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ తో ఎలాంటి హీరోయిజం చూపించాడో రెండు నెలల్లో తేలిపోతుంది
This post was last modified on September 28, 2023 11:28 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…