టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొన్ని వారాలుగా స్లంప్ నడుస్తోంది. ఈ నెలలో తొలి రెండు వారాల్లో ఖుషి, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి వారాలను ఖాళీగా వదిలేశారు. వరుసగా రెండు వారాలు చెప్పుకోదగ్గ రిలీజ్‌లే లేవు. మళ్లీ చివరి వీకెండ్లో సందడి కనిపించేలా ఉంది. ఈ వారం స్కంద, చంద్రముఖి-2 లాంటి క్రేజీ చిత్రాలు.. ‘పెదకాపు’ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజవుతున్నాయి.
ఐతే ముందు వారాల్లోని డల్‌నెస్ ఇంకా కంటిన్యూ అవుతుండటం వల్లో ఏమో.. ఈ మూడు చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశాజనకంగా లేవు. ఉన్నంతలో ‘స్కంద’ మూవీ పరిస్థితి బెటర్. అక్కడక్కడా ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు చూపిస్తున్నాయి. కానీ బోయపాటి-రామ్ కాంబినేషన్ మూవీకి ఉండాల్సినంత క్రేజ్ అయితే లేదు. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్, పాటల వల్ల బజ్ తగ్గిపోవడం ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.
ఇక ‘చంద్రముఖి-2’కు ముందు నుంచి పెద్దగా బజ్ లేదు. సినిమా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతూ వస్తోంది. ఈ సినిమా ప్రోమోలు కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఇక ‘పెదకాపు’ ప్రోమోలు బాగున్నా.. కొత్త హీరో కావడం మైనస్ అవుతోంది. ఇప్పటికైతే ప్రేక్షకులు ఆ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. తక్కువ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా.. వాటికీ స్పందన సరిగా లేదు.
ఈ మూడు చిత్రాలకూ టాక్ కీలకం కానుంది. ఐతే స్కంద, చంద్రముఖి-2 మాస్ సినిమాలు కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నా.. రిలీజ్ టైంకి టార్గెట్ ఆడియన్స్ నేరుగా థియేటర్లకు పెద్ద సంఖ్యలోనే వస్తారని భావిస్తున్నారు. ‘పెదకాపు’ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది కాబట్టి.. టాక్ బాగుంటే అది కూడా పుంజుకుంటుంది. మరి ఈ వారం అయినా బాక్సాఫీస్’లో తిరిగి సందడి నెలకొంటుందేమో చూడాలి.
This post was last modified on September 27, 2023 10:51 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…