రేపటి నుంచి రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద మంచి పోటీ చూడబోతున్నాం. ఈసారి అన్నీ మాస్ ని టార్గెట్ గా పెట్టుకున్నవే కావడం గమనించాల్సిన విషయం. మొదటగా చెప్పుకోవాల్సింది స్కంద. రామ్ ఊర మాస్ అవతారంతో దర్శకుడు బోయపాటి శీను ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తాడని బయ్యర్ల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కంటెంట్ మీద కొన్ని అనుమానాలు తలెత్తినప్పటికీ రెండో ట్రైలర్ తో దాన్ని సరిచేశారు. అయితే మౌత్ టాక్ దీనికి చాలా కీలకం కానుంది. అఖండ తర్వాత అంతకు మించి అనే రేంజ్ లో అభిమానులు స్కంద కోసం ఎదురు చూస్తున్నారు.
శ్రీలీల గ్లామర్, తమన్ సంగీతం, భారీ నిర్మాణం ఇవన్నీ ఆకర్షణలకు లోటు లేకుండా చూసుకుంటున్నాయి. ఇక రెండోది చంద్రముఖి 2. రజనీకాంత్ బ్లాక్ బస్టర్ కి కొనసాగింపన్న మాటే కానీ ప్రమోషన్లు, ట్రైలర్లు చూశాక మరీ కొత్తగా ఉంటుందన్న అభిప్రాయం టీమ్ కలిగించలేకపోయింది. అయితే అసలు సినిమాలో చాలా సర్ప్రైజులు ఉంటాయని ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాన్ని టీమ్ వ్యక్తం చేస్తూ వస్తోంది. విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన పెదకాపు 1 మీద ఆడియన్స్ లో మెల్లగా ఆసక్తి పెరుగుతోంది. పబ్లిసిటీ కూడా దీనికి కారణమే.
ట్రయాంగిల్ పోటీ ప్రధానంగా ఈ మూడింటి మధ్యే ఉంటోంది. అన్నీ మాస్ వర్గాలను లక్ష్యంగా పెట్టుకున్నవే. ప్రత్యేకంగా క్లాస్ కోసమంటూ ఏదీ లేదు. ఈ నేపథ్యంలో వీటికి పాజిటివ్ టాక్ రావడం కీలకం కానుంది. బాలీవుడ్ నుంచి ఫక్రే 3, ది వ్యాక్సిన్ వార్ లు ఉన్నాయి కానీ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే వీటి మీద బజ్ అంతగా లేదు. సో రెండు వారాల నుంచి డల్ గా ఉన్న తెలుగు బాక్సాఫీస్ కి కొత్త జోష్ తీసుకొచ్చే బాధ్యత స్కంద, చంద్రముఖి 2, పెదకాపు 1ల మీదే ఉంది. అంచనాలు అందుకుంటే మాత్రం థియేటర్లు మళ్ళీ హౌస్ ఫుల్స్ తో కళకళలాడటం చూడొచ్చు.
This post was last modified on September 27, 2023 4:22 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…