సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి.. ఈ రెండు పేర్లకూ అసలు సంబంధమే లేదు. ఇంతకుముందు ఎప్పుడూ వాళ్లిద్దరూ కలిసి కనిపించింది లేదు. కలిసి సినిమా చేసింది లేదు. ఐతే ఈ మధ్యే వాళ్లిద్దరూ కలిసి సత్య అనే చిన్న షార్ట్ ఫిలిం ఒకటి చేశారు. ఐతే మంగళవారం వీళ్లిద్దరి గురించి సామాన్య జనాలకు ఓ కొత్త విషయం తెలిసింది. తేజు, స్వాతి కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారట. వాళ్లిద్దరూ క్లాస్ మేట్స్ కూడానట.
ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం ఈ రోజే బయటి ప్రపంచానికి వెల్లడించారు. స్వాతి ప్రధాన పాత్ర పోషించిన మంత్ ఆఫ్ మధు అక్టోబరు 6న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు తేజు అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా స్టేజ్ మీద ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్‌లా మూవ్ అవుతుంటే ఏమో అనుకున్నారు మీడియా వాళ్లు.
కానీ ఆ తర్వాతే తెలిసింది ఇద్దరూ క్లాస్ మేట్స్. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. స్వాతినే ఈ విషయాన్ని వెల్లడించింది. తేజును ఆమె రేయ్, వాడు అని కూడా సంబోధించడం విశేషం. తామిద్దరం కలిసి ఒకే కాలేజీలో డిగ్రీ చదివామని ఆమె తెలిపింది. అందరూ తాను తేజు కంటే పెద్దదాన్ని అనుకుంటారని.. ఐతే నటిగా తాను ముందు డెబ్యూ చేశాను అంతే అని.. తమ ఇద్దరిదీ ఒకే వయసని తెలిపింది.
కలిసి చదువుకున్నపుడు తేజు తన పేపర్లోనే చూసి కాపీ కొట్టేవాడని.. తన వల్లే పాసయ్యాడని స్వాతి పేర్కొనగా.. అసలు పరీక్షల్లో చూపించేదే కాదు అని తేజు చమత్కరించాడు. తన పేర్లు ఎస్‌తో మొదలు కావడంతో ప్రాక్టికల్స్‌లో కూడా ఒకేదగ్గర పడేవాళ్లమని స్వాతి చెప్పింది. ఇలా కొంతసేపు కామెడీ చేశాక.. తేజ తనకు జీవితంలో చాలా ముఖ్యమైన ఫ్రెండ్ అని, తనకెంతో సపోర్ట్ ఇస్తాడని స్వాతి చెప్పగా.. తేజు కూడా తనెంత క్లోజ్ ఫ్రెండో వివరించాడు.
This post was last modified on September 26, 2023 11:48 pm
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…