‘సలార్’ సినిమా వాయిదా పుణ్యమా అని కొన్ని నెలల పాటు వివిధ భాషల్లో సినిమాల రిలీజ్ డేట్లు అటు ఇటు అయ్యేలా పరిస్థితి నెలకొంది. పదుల సంఖ్యలో సినిమాల రిలీజ్ డేట్లు తారుమారు అయ్యాయి. సెప్టెంబరు నెలలో ముందు అనుకున్న షెడ్యూల్ వేరు. తర్వాత జరిగింది వేురు. ‘సలార్’ కొత్త డేట్‌ను బట్టి మరిన్ని సినిమాల పరిస్థితి గందరగోళంలో పడుతుందని ముందు నుంచే అంచనా వేస్తున్నారు.
ఆ సినిమా వేటి మీద బాంబు వేస్తుందో అని ఎదురు చూస్తుండగా.. క్రిస్మస్ రిలీజ్ డేట్ తెరపైకి వచ్చింది. ఇంకా అఫీషియల్ న్యూస్ రాకపోయినా క్రిస్మస్‌కే కన్ఫమ్ అని అంటున్నారు. ముందుగా ఈ వార్తతో బాలీవుడ్ ఉలిక్కి పడింది. క్రిస్మస్‌కు షెడ్యూలైన షారుఖ్ ఖాన్ సినిమా ‘డుంకి’కి ‘సలార్’తో కచ్చితంగా ఇబ్బందే. రాజ్ కుమార్ హిరాని రూపొందిస్తున్న ఈ క్లాస్ మూవీ ఎంత బాగున్నా సరే.. ‘సలార్’ లాంటి మాస్ మూవీతో పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర నిలవడం తేలిక కాదు. దీంతో బాలీవుడ్ నుంచి ‘సలార్’ పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది.
ఐతే బాలీవుడ్ సంగతి తర్వాత ఇంతకీ టాలీవుడ్ నుంచి రానున్న క్రిస్మస్ సినిమాల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం. క్రిస్మస్‌కు ఏ భారీ చిత్రం రాదన్న క్లారిటీ వచ్చాక విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’తో పాటు నాని సినిమా ‘హాయ్ నాన్న’, నితిన్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లను క్రిస్మస్‌కు షెడ్యూల్ చేశారు. కొన్ని నెలల ముందే డేట్లు ఇచ్చేసి ఆ దిశగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుని ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్నారు ఆయా చిత్ర బృందాలు.
కానీ ఇప్పుడేమో వాటికి షాకిస్తూ ‘సలార్’ క్రిస్మస్ రేసులోకి వచ్చింది. ‘సలార్’ రావడం పక్కా అయితే.. వీటిలో ఒక్క సినిమా కూడా క్రిస్మస్‌కు రాదు. తర్వాత సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు ఫుల్ అయిపోయిన పరిస్థితి. ఆ సీజన్ మిస్సయితే.. వేసవి వరకు శకునాలు బాగుండవు. సంక్రాంతి సీజన్ అవ్వగానే రెండు నెలలు ఆఫ్ సీజన్ నడుస్తుంది. వేసవిలో ఏమో చాలా సినిమాలు పోటీకి సై అంటున్నాయి. పోటీ సంగతి పక్కన పెడితే.. మూణ్నాలుగు నెలలు తమ చిత్రాలను వాయిదా వేసుకోవాలంటే ఎవరికైనా ఇబ్బందే. మరి వీటి భవితవ్యం ఏమవుతుందో చూడాలి.
This post was last modified on September 26, 2023 4:37 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…