దర్శకుడిగా ఆరెక్స్ 100 లాంటి సెన్సేషనల్ మూవీతో డెబ్యూ అందుకున్న అజయ్ భూపతి ఈసారి టైటిల్ తో మొదలుపెట్టి టీజర్ దాకా మంగళవారం గురించి మంచి ఆసక్తి కలిగేలా చూసుకుంటున్నాడు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా విరూపాక్షని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టిన అజనీష్ లోకనాథ్ సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ విలేజ్ థ్రిల్లర్ ని నవంబర్ 17 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆనంద్ దేవరకొండ గంగం గణేశా తప్ప చెప్పుకోదగ్గ పోటీ లేకుండా మంచి సేఫ్ గేమ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు.
ప్యాన్ ఇండియా భాషల్లో విడుదలవుతున్న మంగళవారంకు అసలు ముప్పు ముందు వారం పొంచి ఉంది. సల్మాన్ ఖాన్ ప్రెస్టీజియస్ మూవీ టైగర్ 3ని అదే నెల 10 లేదా 13 తేదీల్లో రిలీజ్ చేయడానికి యష్ రాజ్ ఫిలింస్ ఏర్పాట్లు చేస్తోంది. అదే జరిగితే మంగళవారంకు ఇతర భాషల్లో ముప్పు తప్పదు. కార్తీ జపాన్, వైష్ణవ్ తేజ్ ఆదికేశవలు అప్పటికే వచ్చి ఉంటాయి. అజయ్ భూపతి సినిమాకు స్టార్ క్యాస్టింగ్ లేదు. కంటెంట్ ప్లస్ విజువల్స్ ని నమ్ముకుని వస్తోంది. అలాంటప్పుడు కాంపిటీషన్ లేని డేట్ ని చూసుకోవడం మంచిదే. కాకపోతే టైగర్ 3 హిట్ టాక్ తెచ్చుకుంటే వసూళ్ల మీద ప్రభావం ఉంటుంది.
రేపు టైగర్ 3 టీజర్ తో పాటు డేట్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. మహాసముద్రం ఫలితం అజయ్ భూపతిని బాగా డిఫెన్స్ లో పడేసింది. అందుకే మంగళవారంతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఓ గ్రామంలో జరిగే అనూహ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో పాయల్ క్యారెక్టరైజేషన్ చాలా షాకింగ్ గా ఉంటుందట. ఆడియన్స్ కి కనెక్ట్ అయితే హిట్టు పడ్డట్టే. డిసెంబర్ లో సలార్ వస్తుందనే వార్తల నేపథ్యంలో కొన్ని మీడియం రేంజ్ సినిమాలు నవంబర్ కు ప్రీ పోన్ అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం. సో పోటీకి సంబందించి ఇప్పుడప్పుడే ఒక నిర్ధారణకు రావడం కష్టం.