ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సలార్ విడుదల వ్యవహారంలో కొత్త కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా డిసెంబర్ 22 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్లకు మెయిల్ వచ్చిందన్న వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి. మరోవైపు పంపిణీదారులు అలాంటిదేమీ లేదని అంటున్నారు. బాలీవుడ్ కు సంబందించిన పేరున్న వెరిఫైడ్ హ్యాండిల్స్ అన్నీ షారుఖ్ వర్సెస్ ప్రభాస్ అంటూ కథనాలు మొదలుపెట్టాయి. ఎందుకంటే డుంకీ ఆ డేట్ ని గత ఏడాదే లాక్ చేసుకుంది కాబట్టి.
వీలైనంత త్వరగా హోంబాలే ఫిలిమ్స్ దీనికి చెక్ పెట్టడం అత్యవసరం. లేదూ ఇది అబద్దమైతే దాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి. లేకపోతే లేనిపోని ప్రచారాలకు చోటు ఇచ్చినట్టవుతుంది. ఇదంతా ఉత్తి పుకారని కొట్టి పారేయలేం. ఎందుకంటే ప్యాన్ ఇండియా మూవీ ఏదైనా ఊరికే ఆషామాషీగా గాలిమాటగా డేట్లు లాక్ చేసుకోవు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి సవాలక్ష వ్యవహారాలు ఉంటాయి. కోట్ల రూపాయలు చేతులు మారతాయి. చిన్న మార్పు పెద్ద పరిణామానికి దారి తీస్తుంది. అందుకే డిసెంబర్ 22 నిజమా కాదానేది కొంచెం అర్జెంటుగానే తేల్చేస్తే బెటర్.
కొద్దిరోజుల క్రితమే సలార్ నిర్మాతలు మార్చ్ 22 ఆప్షన్ ని చూస్తున్నారని తెలిసిన గంటల వ్యవధిలోనే కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. అసలు ఈ సినిమా ఏ స్టేజిలో ఉందో, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత పెండింగ్, కొంత భాగం రీ షూట్ కు సంబంధించిన వార్తలు వీటన్నింటికి ఏదో ఒక రూపంలో సమాధానం ఇవ్వాలి. సెప్టెంబర్ 28 వదిలేయడమే పెద్ద రచ్చకు దారి తీసింది. స్కంద లాంటి పెద్ద సినిమాలు సైతం చాలా ఇబ్బంది పడ్డాయి. తిరిగి ఇప్పుడు డిసెంబర్ 22 లేక మరొకటా అనే చర్చ ఇతర ప్రొడ్యూసర్లకు టెన్షన్ కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వారం వెంకటేష్, నాని, నితిన్ లు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు మరి.
This post was last modified on September 25, 2023 10:00 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…