గత రెండు వారాంతాల్లో చెప్పుకోదగ్గ రిలీజ్‌లే లేవు తెలుగులో. డబ్బింగ్ సినిమాలు మార్క్ ఆంటోనీ, సప్త సాగరాలు దాటి మాత్రమే ఈ వీకెండ్స్‌ను ఉపయోగించుకున్నాయి. తెలుగులో ఏవో చిన్నా చితకా సినిమాలు రిలీజయ్యాయి. అవి కనీసం ప్రేక్షకుల దృష్టిలో పడలేదు. కానీ రాబోయే వారాంతం నుంచి బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన పోటీ ఉండబోతోంది. ఈ వీకెండ్లో స్కంద, చంద్రముఖి-2, పెదకాపు చిత్రాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
ఇక తర్వాతి వారానికైతే పోటీ మామూలుగా లేదు. చిన్న-మిడ్ రేంజ్ సినిమాలు అరడజను దాకా ఆ వీకెండ్లో రిలీజవబోతుండటం గమనార్హం. ఆల్రెడీ కిరణ్ అబ్బవరం సినిమా ‘రూల్స్ రంజన్’ అక్టోబరు 6కు ఫిక్స్ అయింది. అలాగే నవీన్ చంద్ర-కలర్స్ స్వాతిల ‘మంత్ ఆఫ్ మధు’కు కూడా అదే డేట్ ఫిక్స్ చేశారు. వీటితో పాటు సుధీర్ బాబు సినిమా ‘మామా మశ్చీంద్ర’ కూడా ఆ రోజే రాబోతోంది. అలాగే మురళీధరన్ బయోపిక్ ‘800’ తెలుగు వెర్షన్ కూడా అదే రోజుకు ఫిక్సయింది.
ఇంకా ‘నేనే సరోజ’ అనే చిన్న సినిమా.. ‘ది ఎక్సార్సిస్ట్: బిలీవర్’ అనే హాలీవుడ్ మూవీ కూడా అదే రోజు రాబోతున్నాయి. ఇవన్నీ చాలవని కొత్తగా మరో సినిమా అక్టోబరు 6 రేసులోకి వచ్చింది. అదే.. మ్యాడ్. ఈ సినిమాను సెప్టెంబరు 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ పోటీ ఎక్కువైందని తర్వాతి వారానికి వాయిదా వేశారు. ‘రూల్స్ రంజన్’ విషయంలోనూ ఇలాగే జరిగిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే థియేటర్ల సర్దుబాటు కష్టమవుతుంది. అలాగే ప్రేక్షకుల దృష్టిలో పడటమూ కష్టమే. ఐతే అనావృష్టి లేకుంటే అతివృష్టి అన్నట్లు ఈ మ్యాడ్ రష్ ఏమిటో మరి.
This post was last modified on September 25, 2023 6:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…