గంపెడాశలతో సెప్టెంబర్ లోనే చూసేస్తామని ఎదురు చూసిన ప్రభాస్ అభిమానులకు షాక్ ఇస్తూ సలార్ వాయిదా పడటం ఎన్ని ప్రకంపనలకు దారి తీసిందో గత ఇరవై రోజులుగా చూస్తూనే ఉన్నాం. హోంబాలే ఫిలింస్ అధికారిక ప్రకటన ఈ మధ్య ఇచ్చింది కానీ విషయం అప్పటికే పొక్కిపోయి రోజులు గడిచిపోయాయి. ఇదిలా ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలకమైన కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేసే ఆలోచనను సీరియస్ గా చేస్తున్నట్టు బెంగళూరు టాక్. ముఖ్యంగా క్లైమాక్స్ తాను అనుకున్న విధంగా రాలేదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే వద్దని నిర్మాతలకు తేల్చి చెప్పాడట.
బిజినెస్ పరంగా ఎలాంటి ఢోకా లేనప్పటికీ అవుట్ ఫుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద సైతం సంతృప్తి వ్యక్తం చేయలేదని సన్నిహితులు అంటున్నారు. పర్ఫెక్షన్ కోసం ఎంతకైనా తపించే తెగించే నీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని, వరస ఫ్లాపుల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు అందుకోకపోతే తప్పు మనదే అవుతుంది తప్ప దాన్ని హీరో దురదృష్టం కిందకు తోసేయలేమని అంటున్నారట. 2024 మార్చి ఒక ఆప్షన్ గా పెట్టుకుని లేదంటే సమ్మర్ కి వెళ్లి సోలో రిలీజ్ ఉన్న డేట్ పట్టుకునే ఆలోచనలో ప్రొడ్యూసర్లున్నారు.
మొత్తానికి ప్రశాంత్ నీల్ గ్యారేజ్ లో సలార్ మరమత్తులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంతే కాదు ప్రభాస్ అవసరం లేని ఒక కీలక ఎపిసోడ్ ని సైతం మళ్ళీ చిత్రీకరించారని తెలిసింది. డార్లింగ్ అందుబాటులోకి వచ్చాక ముఖ్యమైన ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయించి డిసెంబర్ లోగా డబ్బింగ్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో ప్రభాస్ పుట్టినరోజుకి ట్రైలర్ వస్తుందా లేదానేది ఇంకా డోలాయమానంలోనే ఉంది. ఇప్పటికిప్పుడు తేల్చే అవకాశం లేకపోవడంతో విడుదల తేదీ సస్పెన్స్ కూడా కొనసాగనుంది. ఓవర్సీస్ హక్కులు ముప్పై ఆరు కోట్లకు పైగానే అమ్మినట్టు ట్రేడ్ న్యూస్.
This post was last modified on September 25, 2023 3:19 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…