Movie News

శ్రీలీలను ఆడేసుకున్న రామ్

ఎవరికి వారు స్క్రీన్ మీద ఎనర్జీతో చెలరేగిపోయే స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న రామ్, శ్రీలీల స్కంద కోసం మొదటిసారి జట్టు కట్టడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా డాన్స్ విషయంలో ఫ్యాన్స్ పెద్ద ఆశలు పెట్టుకున్నారు. దీని ప్రమోషన్లలో భాగంగా యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో ఈ జంట చేసిన సందడి ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రామ్ తనకన్నా బాగా జూనియరైన శ్రీలీలను ర్యాగింగ్ రేంజ్ లో ఆడుకోవడం మంచి వినోదాన్ని ఇచ్చింది. సరదాగా సాగుతూ సుమ అండతో రామ్ చేసిన అల్లరి మీద అప్పుడే బోలెడు మీమ్స్ సోషల్ మీడియాలో మొదలైపోయాయి.

రామ్ క్యాజువల్ గా షార్ట్ లో వస్తే శ్రీలీల మాత్రం మంచి మేకప్ తో ప్రొఫెషనల్ అవుట్ ఫిట్ తో విచ్చేసింది. దీంతో ఆమె తనను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిందని రామ్ కౌంటర్ వేయడంతో అమ్మడికి మాటెలా వస్తుంది. ట్రైలర్ లో ఉన్న నువ్వేమైనా ఫిగరనుకుంటున్నావా డైలాగుని ప్రస్తావిస్తూ శ్రీలీల మీద అలాంటి ఫీలింగ్స్ పోయాయని చెప్పిన రామ్ ఒక్కసారిగా చిన్నపాటి షాక్ ఇచ్చాడు. ప్రాంక్స్ గురించి మాట్లాడుతూ చేసినవన్నీ చేసి అమాయకంగా మొహం పెట్టడం శ్రీలీల స్టైలని మరో చురక వేశాడు. బాలు అనే అసిస్టెంట్ డైరెక్టర్ తో రామ్ చేయించిన ప్రాంక్ ని ఈ సందర్భంగా శ్రీలీల బయట పెట్టేసింది.

బాలు విషయంలో రామ్ ఏకంగా త్రివిక్రమ్ రేంజ్ సెటైర్లు వేసేశాడు. ఇవే కాదు శ్రీలీల కనక డే ఆఫ్ తీసుకుంటే అది ఇండస్ట్రీకే హాలిడే అవుతుందని రామ్ వేసిన పంచు మాములుగా పేలలేదు. ఫేవరేట్ హీరో గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీలీల వారానికి ఒకరిని మార్చాల్సి ఉంటుందని, అన్ని సినిమాలతో బిజీగా ఉందని అసలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. ఒకదశలో సుమ సైతం వీళ్ళ కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది. స్కంద లాంటి ఊర మాస్ సినిమాలో వీళ్ళ అల్లరి ఎంత ఉందో కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం ఫుల్లుగా పండించేశారు.

This post was last modified on September 25, 2023 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిట్ 3 హింస అంచనాలకు మించి

ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…

18 minutes ago

‘టాప్’ లేపిన తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…

2 hours ago

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

6 hours ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

7 hours ago

బాబు మాటతో ఆక్వాకు భరోసా దక్కింది!

అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…

7 hours ago

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…

8 hours ago