ఒక పెద్ద హీరో సినిమా టీజర్ అంటే దానికి కనీస స్థాయిలో సందడి ఉంటుంది. కానీ అసలు కథానాయకుడికి తెలియకుండా, చెప్పకుండా రిలీజ్ చేయడమంటే విచిత్రమే. చియాన్ విక్రమ్ హీరోగా సూర్యపుత్ర కర్ణ అనే ప్యాన్ ఇండియా మూవీ ఆరేళ్ళ క్రితమే అనౌన్స్ చేశారు. కొంత భాగం షూటింగ్ కూడా అయ్యింది. కానీ ప్రొడక్షన్ లో విపరీతమైన జాప్యం వల్ల విక్రమ్ కు ఆ ప్రాజెక్టుపై ఆసక్తి తగ్గిపోయి పక్కకు తప్పుకున్నాడు. దానికి అనుకున్న డేట్స్ ని మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కి ఇచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇదంతా ఇప్పటిదాకా జరిగిన స్టోరీ.
కట్ చేస్తే సూర్యపుత్ర కర్ణ రచయిత కం దర్శకుడు ఆర్ఎస్ విమల్ తాజాగా టీజర్ విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు. విజువల్స్ గట్రా బాగానే ఉన్నాయి కానీ కథకు సంబంధించిన సన్నివేశాలు, క్లూస్ పెద్దగా లేవు. అసలు ఇది విక్రమ్ కు చెప్పకుండా వదిలారని, కేవలం బిజినెస్ చేసి అడ్వాన్స్ రూపంలో డబ్బులు చేసుకుందామని ఇలా ప్లాన్ చేశారని చెన్నై మీడియా ఉటంకిస్తోంది. ఇదే కథతో సూర్య హీరోగా ఒక మల్టీ లాంగ్వేజ్ మూవీ ప్లాన్ లో ఉండగా ఇప్పుడీ కర్ణను తెరముందుకు తీసుకురావడం అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తోంది. విక్రమ్ వెర్షన్ షూట్ అయిపోయి ఉంటే ఏదోలే అనుకోవచ్చు. అసలు జరిగితే కదా.
ప్రస్తుతానికి విక్రమ్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి స్పందన లేదు. ట్విట్టర్ లోనూ దీన్ని షేర్ చేయడం లాంటివి చేయలేదు. అయినా పూర్తవ్వని సినిమాను పట్టుకుని ఇలా చేయడం వెనుక ఏం ధైర్యం ఉందో ఏమిటో కానీ మొత్తానికిది హాట్ టాపిక్ అయిపోయింది. విక్రమ్ కు ఇలా జరగడం మొదటిసారేం కాదు. గౌతమ్ మీనన్ తో ధృవ నచ్చత్థిరం చేస్తే ఆరేళ్ళ తర్వాత కానీ మోక్షం దక్కలేదు. అంతకుముందు ఐ, ఇంకొక్కడు లాంటివి ఎన్నో అవాంతరాలు దాటుకున్నవే. అయితే సూర్యపుత్ర కర్ణ ట్విస్టు మాత్రం విచిత్రంగా ఉంది. ఇలా చేసినంత మాత్రం హీరో కరిగిపోయి డేట్లు ఇస్తాడా ఏం.
This post was last modified on September 25, 2023 9:52 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…