Movie News

మిస్టర్ పోలిశెట్టికి అలసట ఎందుకు రాదు

ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఏదైనా సినిమా చిన్నదో పెద్దదో బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వెళ్లిపోయిందంటే ప్రొడక్షన్ హౌస్ తో సహా అందరూ సైలెంట్ అయిపోతారు. ఒకవేళ ఫ్లాప్ అయినా ఇందులో పెద్దగా మార్పు ఉండదు.  ఎందుకంటే అదనంగా ఎందుకు తిరిగి ఖర్చు పెట్టుకోవడమనే ఉద్దేశంతో. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం అలా ఆలోచించడం లేదు. తన కొత్త మూవీ మూడు వారాలు పూర్తి చేసుకోబోతూ తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ కొట్టి ఓవర్సీస్ లో రెండు మిలియన్ మార్కు వైపు పరుగులు పెడుతున్నా సరే అలుపు లేకుండా దేశాలు రాష్ట్రాలు తిరుగుతూనే ఉన్నాడు. తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ ని కలుస్తూనే ఉన్నాడు.

జవాన్ ని తట్టుకుని మరీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఈ ఫిగర్లను సాధించడం వెనుక నవీన్ కష్టం అంతా ఇంతా కాదు. అనుష్క ఏమో బయటికి రాలేని పరిస్థితి. వేరే స్టార్ క్యాస్టింగ్ ఎవరూ లేరు. పోనీ మ్యూజిక్ ఏమైనా నలుమూలలా వినిపించే రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యిందా అంటే అదీ జరగలేదు. కేవలం ఎంటర్ టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ ని నమ్ముకుని థియేటర్లలో అడుగుపెట్టింది. నవీన్ పోలిశెట్టి చేసిన మేజిక్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కదిలించింది. ముఖ్యంగా వృద్ధులు సైతం రావడం అతని రీచ్ ఏంటో చెప్పకనే చెప్పింది. హిట్టు కోసం తహతహలాడుతున్న యువి బ్యానర్ కి పెద్ద సక్సెస్ దక్కింది.

యూత్ హీరోలు ఈ విషయంలో నవీన్ ని ఫాలో కావాల్సిందే. నటించి పారితోషికం తీసుకోవడం వరకే పరిమితం కాకుండా ఇలా నాన్ స్టాప్ ప్రమోషన్లు చేయడం వల్ల వ్యక్తిగత ప్రయోజనం కంటే నిర్మాతకు కలిగే లాభమే ఎక్కువగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ టైంలో సుమారు సంవత్సరం పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కేవలం రాజమౌళికి మద్దతు ఇవ్వడం కోసం తమ షూటింగులను వాయిదా వేసుకుని ముంబై నుంచి జపాన్ దాకా విపరీతంగా తిరిగారు. దానికి తగ్గ ఫలితం దక్కింది. ఇప్పుడు తిరిగి నవీన్ పోలిశెట్టి అదే బాటలో నడుస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

This post was last modified on September 25, 2023 9:06 am

Share

Recent Posts

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

1 hour ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

2 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

4 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

7 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

7 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

8 hours ago