ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో మాస్ పరంగా ఎక్కువ దృష్టి రామ్ స్కంద మీదే ఉంది కానీ పెదకాపు 1ని మరీ తక్కువంచనా వేయడానికి లేదు. ట్రైలర్ రాకముందు వరకు దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ కి పేరుగన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకుని చేసిన విలేజ్ డ్రామా ఇది. చాలా బలమైన సామజిక అంశాన్ని స్పృశించినట్టు సీన్లు, డైలాగులు చూస్తే అర్థమైపోతోంది. అయితే పెదకాపు టైటిల్ పెట్టడంలో ఉద్దేశం ఒక కులాన్ని టార్గెట్ చేయడం కోసమేననే కామెంట్స్ ఇండస్ట్రీతో పాటు బయటి వర్గాల్లోనూ వినిపించాయి.
వీటికి శ్రీకాంత్ అడ్డాలే స్వయంగా వివరణ ఇచ్చారు. దీనికి ముందు అనుకున్న టైటిల్ కన్నా. ఓసారి కాకినాడ దగ్గరున్న గొల్లలమామిడి అనే ఊరికి ఈయన వెళ్ళినప్పుడు అక్కడో బస్సు షెల్టర్ చూశారు. పైన బోర్డు మీద దాత పేరుతో పాటు బ్రాకెట్ లో పెదకాపు అని పెట్టారు. దీంతో అక్కడున్న పెద్దమనుషులను అదేంటి రెడ్డిగారి పేరు చివర్న కాపని ఎందుకు పెట్టారని అడిగారు. దానికి వాళ్ళు సమాధానమిస్తూ నలుగురికి పని ఇచ్చి ఆదుకుంటూ వాళ్ళతో పాటు తానూ పని చేస్తే పెదకాపులంటారని, ఏదో డబ్బుంది కదాని దాచకుండా అందరికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళని వివరించారట.
ఇదంతా విన్న తర్వాత తన కథకి ఇదే బెస్టని గుర్తించిన శ్రీకాంత్ అడ్డాల పెదకాపుకే ఫిక్స్ అయ్యారట. సో ఇదేదో సామజిక వర్గాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమాగా ఊహిస్తున్న వాళ్లకు ట్విస్టు ఇచ్చేసినట్టే. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన పెదకాపు ప్రమోషన్లు జోరుగానే జరుగుతున్నాయి. హీరో విరాట్ కర్ణతో మొదలుపెట్టి అనసూయ దాకా అందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. స్కందతో పాటు చంద్రముఖి 2 కూడా కాచుకుని ఉండటంతో స్టార్ క్యాస్టింగ్ లేని పెదకాపు కేవలం కంటెంట్ నే నమ్ముకుంటోంది. అఖండ బ్యానర్ కావడంతో థియేట్రికల్ రిలీజ్ గట్టిగానే ప్లాన్ చేశారు.
This post was last modified on September 23, 2023 5:32 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…