Movie News

ఒక్క సలార్ తప్పుకుంటే…

వినాయక చవితి తర్వాత.. దసరాకు ముందు.. మధ్యలో బాక్సాఫీస్‌ను వేడెక్కించే డేట్‌గా సెప్టెంబరు 28 మీద అందరూ దృష్టిసారించారు. ఆ రోజు ప్రభాస్-ప్రశాంత్ నీల్‌ల క్రేజీ మూవీ ‘సలార్’ విడుదల కావాల్సింది. మూడు వారాల ముందు వరకు ఉన్న అంచనా ప్రకారం అయితే ‘సలార్’తో పాటుగా ఆ వీకెండ్లో ‘వ్యాక్సిన్ వార్’ మాత్రమే రావాల్సింది.

గురువారం గణేష్ నిమజ్జనం సెలవుతో మొదలుపెడితే.. సోమవారం గాంధీ జయంతి సెలవు వరకు ఐదు రోజుల ఎక్స్‌టెండెడ్ వీకెండ్‌లో ‘సలార్’ వసూళ్ల మోత మోగించేయడం ఖాయం అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ సినిమా వాయిదా పడిపోవడం ప్రేక్షకులకే కాదు.. ఫిలిం ఇండస్ట్రీకి కూడా పెద్ద షాక్. ‘సలార్’ వాయిదా వల్ల కొన్ని నెలల పాటు వివిధ ఇండస్ట్రీల్లో సినిమాల రిలీజ్‌ డేట్లలో అనేక మార్పులు జరిగాయి. ‘సలార్’ వచ్చేట్లయితే ‘వ్యాక్సిన్ వార్’ మినహా దానికి పోటీగా ఏ సినిమా ఉండేది కాదు.

కానీ ‘సలార్’ వాయిదా పడటంతో వివిధ భాషల్లో కలిపి ఆ వీకెండ్లో ఏకంగా 25 సినిమాల దాకా రిలీజవుతుండటం విశేషం. తెలుగులో ‘సలార్’ స్థానంలోకి స్కంద, పెదకాపు వచ్చాయి. వీటితో పాటు డబ్బింగ్ మూవీ ‘చంద్రముఖి-2’ కూడా రిలీజవుతోంది. ‘వ్యాక్సిన్ వార్’ తెలుగు వెర్షన్ సైతం రిలీజవుతోంది.

హిందీలో ‘వ్యాక్సిన్ వార్’తో పాటు ఫక్రీ-3, ప్యార్ హై తో హై లాంటి మూణ్నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. తమిళంలో ‘చంద్రముఖి-2’తో పాటు ఇంకో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలా ఒక్కో భాషల్లో మూణ్నాలుగు సినిమాలు ‘సలార్’ ప్లేస్‌ను ఆక్రమించాయి. మొత్తంగా ఈ సినిమాల లెక్క పాతిక దాకా ఉంది. ఒక్క ‘సలార్’ వాయిదా పడితే.. బాక్సాఫీస్ దగ్గర ఇంత మ్యాడ్ రష్ ఆ అని సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ‘సలార్’ వల్ల రిలీజ్ డేట్‌లు అటు ఇటు అయిన సినిమాల లిస్టు తీస్తే 50కి తక్కువగా ఉండదేమో.

This post was last modified on September 23, 2023 4:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప 3 లో యాక్ట్ చేస్తావా? : తిలక్ ఏమన్నాడంటే…

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…

2 hours ago

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు…

2 hours ago

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

5 hours ago

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…

7 hours ago