మెగాస్టార్ చిరంజీవిని వయసుకు తగ్గ పాత్రల్లో చూడాలన్నది మెజారిటీ ప్రేక్షకుల ఆకాంక్ష. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీలో, లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో వయసుకు తగ్గ పాత్రల్లోనే ప్రేక్షకులను అలరించారు. అలాగే చిరు కూడా నడి వయస్కుడి పాత్రల్లోకి మారితే మంచిదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. గాడ్ ఫాదర్ మూవీలో కొంతమేర వయసుకు తగ్గ పాత్రలో కనిపించాడు చిరు.
ఇప్పుడు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చేయబోయే సినిమాలోనూ ఆయన రూటు మారుస్తున్నారు. ఇందులో చిరు తన వయసు, ప్రస్తుత ఇమేజ్‌కు తగ్గ పాత్రనే చేస్తున్నట్లు స్వయంగా వశిష్ఠనే వెల్లడించాడు. ఇందులో హీరోయిన్లు ఉంటారు కానీ.. రొమాన్స్ కానీ, అలాంటి టచ్ ఉన్న సీన్లు కానీ ఉండవని తేల్చేశాడు వశిష్ఠ. ఇది ఫాంటసీ మూవీ అని.. ఆ జానర్‌కు తగ్గట్లే సినిమా నడుస్తుందని వశిష్ఠ తెలిపాడు.
తాను చిన్నతనంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసి ఎంతగానో ఎంజాయ్ చేశానని.. అప్పటి పిల్లలకు అదొక మధుర జ్ఞాపకమని.. అలాగే ఇప్పటి పిల్లలు కూడా చిరును చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని వశిష్ఠ తెలిపాడు. ఈ చిత్రంలో అనుష్క సహా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ పని నడుస్తుండగా.. నవంబరులో సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అనుకున్న సినిమాను హోల్డ్ చేసి మరీ.. ఈ చిత్రాన్నే ముందు మొదలుపెట్టాలని చిరు చూస్తున్నట్లు సమాచారం.
This post was last modified on September 22, 2023 11:38 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…