ఇంకా కాలేజీ చదువు కూడా దాటని గారాల కూతురు మీరా ఆత్మహత్య చేసుకోవడాన్ని తమిళ హీరో విజయ్ ఆంటోనీ జీర్ణించుకోలేకపోవడం చూస్తున్నాం. తనతో పాటు నేను కూడా చనిపోయానని నిన్న చేసిన ట్వీట్ హృదయాలను మెలిపెట్టేలా ఉంది. పిల్లలే ప్రపంచంగా బ్రతికే తండ్రికి అందులో ఒకరు దూరమైతే కలిగే బాధను ప్రపంచంలో ఎవరూ ఓదార్చలేరు. అతన్ని కలిసిన వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం విజయ్ ఆంటోనీని చూస్తూ కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా ఉందట. ఇంత బాధలో ఉన్నా తన కొత్త సినిమా విడుదల ఆపకూడదని నిర్ణయించుకోవడం విశేషం.
అక్టోబర్ 6న విజయ్ ఆంటోనీ కొత్త మూవీ రత్తం రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు వాయిదాల తర్వాత మంచి డేట్ చూసుకుని రంగంలోకి దిగుతోంది. సిఎస్ ఆముదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్ కూడా సిద్ధమవుతోంది. క్రైమ్ డిపార్ట్ మెంట్ లో పని చేసే ఆఫీసర్ గా విజయ్ ఆంటోనీ ఇందులో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషించాడు. కిందటి వారం నుంచే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. అయితే బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను ముందస్తుగానే లాక్ చేసుకోవడంతో ఒకవేళ మళ్ళీ వాయిదా అంటే నిర్మాతకు బాగా నష్టం వస్తుంది.
ఈ కారణంగానే రత్తంని అనుకున్న టైంకే రిలీజ్ చేసేయమని ఓదార్చడానికి వచ్చిన దర్శక నిర్మాతలకు విజయ్ ఆంటోనీ చెప్పేసినట్టు తెలిసింది. ప్రమోషన్ లోనూ పరిమితంగా పాల్గొంటానని, జరిగిన దుర్ఘటన మర్చిపోయి కూతురు కోరుకున్నది చేయాలంటే వెంటనే సినిమాల్లో యాక్టివ్ కావడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారట. బిచ్చగాడుతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే చూశాడు కానీ ఆ బ్రాండే అతన్ని కాపాడుతూ వస్తోంది. సీక్వెల్ సైతం తమిళంలో కన్నా తెలుగులోనే పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2023 7:47 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…