ఇవాళ చిన్న సినిమాలు చాలానే రిలీజయ్యాయి. పెద్దవి లేకపోవడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు యథాశక్తి ప్రమోషన్లు చేసుకుని థియేటర్లలో అడుగు పెట్టాయి. కానీ దేనికీ కనీస ఓపెనింగ్స్ లేవు. అష్టదిగ్బంధనం, ఛీటర్, మట్టి కథ, నచ్చినవాడు, నెల్లూరి నెరజాణ, ఓయ్ ఇడియట్, రుద్రంకోట, వారెవ్వా జతగాళ్ళు ఇలా 8 స్ట్రెయిట్ మూవీస్ విడుదలైతే డబ్బింగ్ బ్యాచు నుంచి ఒక వర్గం ప్రత్యేక అంచనాలతో కన్నడ అనువాదం సప్త సాగరాలు దాటి సైడ్ ఏ వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణ కావడంతో భారీగా కాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్క్రీన్లు దక్కాయి.
ఇవి కాకుండా కలివీరుడు, ఎక్స్ పెండబుల్స్ 4, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలు లిస్టులో ఉన్నాయి. ఇక్కడ మిస్ అయినవి లేకపోలేదు. వీటికన్నా మెరుగ్గా రీ రిలీజ్ 7జి బృందావన కాలనీ వసూళ్లు రాబడుతుందని బయ్యర్లు అంచనా వేశారు. ట్రాజెడీ ఏంటంటే జనాలు అసలు థియేటర్లలు వెళ్లే మూడ్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. దానికి రెండు కారణాలు. ఒకటి వినాయక చవితి పండగ సంబరాలకు సగటు మధ్యతరగతి జీవుల దగ్గర డబ్బులు ఖర్చయిపోవడం. మరొకటి పొడిగా ఉన్న వాతావరణం వల్ల కొత్త సినిమాలు చూడాలని ఉత్సాహం రేపేంత రేంజ్ లో ఏవీ కనిపించకపోవడం.
ఒకవేళ స్కంద వచ్చి ఉంటే సీన్ ఇలా ఉండేది కాదు. కానీ సలార్ డేట్ వాడుకోవాలని నెలాఖరుకు వెళ్లడంతో చిక్కొచ్చి పడింది. దీంతో ఈ శుక్రవారం ఇలా మారిపోయింది. ఇక్కడ చెప్పిన వాటికన్నా జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలే కొంచెం మెరుగ్గా కనిపించాయంటే అతిశయోక్తి కాదు. ఓటిటి కంపెనీలు థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామనే కండీషన్ ని కఠినతరం చేయడంతో ఛోటా ప్రొడ్యూసర్లు గంపగుత్తగా బాక్సాఫీస్ మీద పడిపోవడం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. దీని వల్ల ఒనగూరుతున్న ప్రయోజనం కూడా ఒకరిద్దరికే దక్కుతోంది తప్ప అందరికీ కాదు.
This post was last modified on September 22, 2023 6:00 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…