Movie News

హమ్మయ్యా .. ఏజెంటుకి మోక్షం దక్కింది

ఇంక రాదేమో మళ్ళీ చూడలేమేమో అని తెగబాధపడుతున్న అక్కినేని అభిమానులకు ఊరట కలిగిస్తూ ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ సెప్టెంబర్ 29 అంటే వచ్చే వారం జరగనుంది. ఈ మేరకు సోనీ లివ్ ప్రత్యేకంగా ఒక ట్రైలర్ తో పాటు ఈ విషయాన్ని ప్రకటించింది. ఎప్పుడో ఏప్రిల్ లో రిలీజైన ఒక పెద్ద సినిమా ఇప్పటిదాకా డిజిటల్ వెలుగు చూడకపోవడం దీని విషయంలోనే జరిగింది. నిర్మాత అనిల్ సుంకర సైతం దీని గురించి క్లారిటీ ఇవ్వలేకపోవడంతో అయోమయం పెరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు కనీసం టీవీలో కూడా రాదని ఫీలవుతున్న టైంలో ఫైనల్ గా గుడ్ న్యూస్ వచ్చేసింది.

నిజానికి ఇంత ఆలస్యం ఎందుకు చేశారనేది మాత్రం అంతు చిక్కలేదు. ఒకవేళ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏమైనా కోర్టు కేసు ఉందా అంటే దానికి ఓటిటికి లింక్ లేదు. అలాంటప్పుడు నెలల తరబడి ఆపడం అనూహ్యం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యాన్ ఇండియా మూవీ కనీసం యాభై శాతం రికవరీ కూడా చేయలేక టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. ఫ్యాన్స్ కొందరు అసలిది రాకపోవడమే మంచిదనుకున్నారు కానీ ఎట్టకేలకు వెలుగు చూస్తోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఏజెంట్ కు హిప్ హాప్ తమిళ సంగీతం మైనస్ అయ్యింది.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. హిట్టు ఫ్లాపు ఫలితంతో ఏదైనా సినిమా ఓటిటి బజ్ కూడా ఆధారపడి ఉంటుంది. కరోనా టైంలో బాలేని వాటిని కూడా జనం ఆదరించారనే లెక్క ఇప్పుడు పని చేయడం లేదు. సోషల్ మీడియాలో ఏదైనా మూవీ ట్రోల్ అయ్యిందా చాలు. దాన్ని ఉచితంగా అయినా సరే కన్నెత్తి చూసేందుకు ఇష్టపడటం లేదు. డబ్బులు ఖర్చు లేదు కానీ సమయం వెచ్చించాలిగా.  మరి ఇదే సంస్థ నిర్మించిన భోళా శంకర్ లాగా ఏజెంట్ కూడా ట్రోలింగ్ కి బలవుతాడా లేక ఓసారి చూడొచ్చనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటాడా చూడాలి. లెట్ వెయిట్ అండ్ సీ. 

This post was last modified on September 22, 2023 5:49 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

5 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

6 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago