Movie News

తారక్ టీజర్‌పై రాజమౌళి ఏమన్నాడంటే..


మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులను ఉర్రూతలూగించేశాడు రాజమౌళి. అదిరిపోయే విజువల్స్, వావ్ అనిపించే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెన్స్.. గూస్ బంప్స్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అ్లలూరి సీతారామరాజు పాత్ర పరిచయ వీడియో అద్భుత స్పందన వచ్చింది.

అది చూశాక మే 20న తార‌క్ పుట్టిన రోజుకు ఇదే త‌ర‌హా ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విత్ రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ ఉంటుంద‌ని ఫిక్స‌యిపోయి ఉన్నారు నందమూరి అభిమానులు. కానీ లాక్ డౌన్ వల్ల తారక్ కోసం టీజర్ రెడీ చేసే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత నెలలు గడిచిపోయాయి. ‘ఆర్ఆర్ఆర్’ టీం షూటింగ్ కోసం సన్నాహాలు మొదలు పెట్టినట్ల పెట్టి ఆపేసింది. దీంతో తారక్ టీజర్ కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈ టీజర్ గురించి ఓ అప్ డేట్ ఇచ్చాడు రాజమౌళి.

ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న జక్కన్న తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడాడు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణను పున:ప్రారంభించడంతో పాటు తారక్ టీజర్ రిలీజ్ చేయడం గురించి ఇందులో జక్కన్న మాట్లాడాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి ఎలా ఉందనే విషయమై తాము వైద్య నిపుణులతో మాట్లాడుతున్నామని.. వాళ్ల సూచనల్ని బట్టి షూటింగ్ పున:ప్రారంభిస్తామని రాజమౌళి తెలిపాడు.

వైద్యులు ఓకే అంటే రెండు మూడు వారాల్లో షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు. ఐతే చిత్రీకరణ మొదలుపెట్టి అంతా ఓకే అనుకున్నాక తారక్ టీజర్ కోసం కంటెంట్ రూపొందించడానికి 10-15 రోజులు సమయం పడుతుందని రాజమౌళి తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే నెల ఏదో ఒక దశలో షూటింగ్ మొదలైతే.. నెలాఖరుకు టీజర్ కంటెంట్ రెడీ అవుతుందేమో. ఆ తర్వాతి నెలలో దసరా వస్తుంది కాబట్టి అప్పటికి టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశముంది.

This post was last modified on August 23, 2020 1:42 pm

Share

Recent Posts

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

11 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

43 minutes ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

1 hour ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

1 hour ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

2 hours ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

2 hours ago