మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులను ఉర్రూతలూగించేశాడు రాజమౌళి. అదిరిపోయే విజువల్స్, వావ్ అనిపించే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెన్స్.. గూస్ బంప్స్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అ్లలూరి సీతారామరాజు పాత్ర పరిచయ వీడియో అద్భుత స్పందన వచ్చింది.
అది చూశాక మే 20న తారక్ పుట్టిన రోజుకు ఇదే తరహా పవర్ ఫుల్ టీజర్ విత్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని ఫిక్సయిపోయి ఉన్నారు నందమూరి అభిమానులు. కానీ లాక్ డౌన్ వల్ల తారక్ కోసం టీజర్ రెడీ చేసే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత నెలలు గడిచిపోయాయి.
‘ఆర్ఆర్ఆర్’ టీం షూటింగ్ కోసం సన్నాహాలు మొదలు పెట్టినట్ల పెట్టి ఆపేసింది. దీంతో తారక్ టీజర్ కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈ టీజర్ గురించి ఓ అప్ డేట్ ఇచ్చాడు రాజమౌళి.
ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న జక్కన్న తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడాడు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణను పున:ప్రారంభించడంతో పాటు తారక్ టీజర్ రిలీజ్ చేయడం గురించి ఇందులో జక్కన్న మాట్లాడాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి ఎలా ఉందనే విషయమై తాము వైద్య నిపుణులతో మాట్లాడుతున్నామని.. వాళ్ల సూచనల్ని బట్టి షూటింగ్ పున:ప్రారంభిస్తామని రాజమౌళి తెలిపాడు.
వైద్యులు ఓకే అంటే రెండు మూడు వారాల్లో షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు. ఐతే చిత్రీకరణ మొదలుపెట్టి అంతా ఓకే అనుకున్నాక తారక్ టీజర్ కోసం కంటెంట్ రూపొందించడానికి 10-15 రోజులు సమయం పడుతుందని రాజమౌళి తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే నెల ఏదో ఒక దశలో షూటింగ్ మొదలైతే.. నెలాఖరుకు టీజర్ కంటెంట్ రెడీ అవుతుందేమో. ఆ తర్వాతి నెలలో దసరా వస్తుంది కాబట్టి అప్పటికి టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశముంది.
This post was last modified on August 23, 2020 1:34 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…