కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో పేరుకి తమిళ సినిమానే కానీ క్రేజ్ మాత్రం ఇతర భాషల్లో ఓ రేంజ్ లో పుంజుకుంటోంది. వరసగా వదులుతున్న పోస్టర్ల మీద సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగే కనిపిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుంచి ఇది ఆశించలేదని ఒక వర్గం అంటుండగా, తుపాను ముందు ప్రశాంతతలా కావాలనే లో ప్రొఫైల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారని ఫ్యాన్స్ అంటున్నారు. తెలుగులో అత్యధిక రేటు పెట్టి కొన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ అక్టోబర్ 19న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులకు ధీటుగా స్క్రీన్ షేరింగ్ ఉంటుందని ట్రేడ్ టాక్.
దీని సంగతలా ఉంచితే లియోలో అసలు పాయింట్ మన మున్నాకు దగ్గరగా ఉంటుందని కోలీవుడ్ టాక్. అదేంటంటే మున్నాలో మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ మీద స్వంత కొడుకు ప్రభాసే ప్రతీకారం తీర్చుకోవడం మీద దర్శకుడు వంశీ పైడిపల్లి ఏదో వెరైటీగా యాక్షన్ టచ్ తో ట్రై చేశాడు కానీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడదే అంశాన్ని తీసుకుని లోకేష్ తనదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. ఆంటోనీ దాస్ గా నటించిన సంజయ్ దత్ కు హీరో విజయ్ కు మధ్య క్లాష్, మధ్యలో అన్నగా నటిస్తున్న అర్జున్ తో యాక్షన్ ప్లస్ ఎమోషన్ తో నడుస్తుందట.
ఇది ఖచ్చితంగా నిజమేనని ఆధారమేమీ లేదు కానీ అంతర్గతంగా వినిపిస్తున్న ప్రకారమైతే అంత ఈజీగా కొట్టిపారేయలేం. కథ ఎలా ఉన్నా కథనంలో ప్రత్యేకమైన మార్క్ చూపిస్తున్న లోకేష్ కనగరాజ్ లియోని అంచనాలకు మించి తీశాడనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. ఇప్పటిదాకా అపజయం ఎరుగని డైరెక్టర్ల లిస్టులో కొనసాగుతున్న ఈ విలక్షణ దర్శకుడు ఈసారి అనిరుద్ రవిచందర్ నుంచి ఎలాంటి అవుట్ ఫుట్ రాబట్టుకున్నాడో చూడాలి. అన్నట్టు లియో కూడా రివెంజ్ డ్రామానే. ఏదో రెగ్యులర్ గా కాకుండా ఒళ్ళు గగుర్పొడిచేలా విజయ్ ఫ్లాష్ బ్యాక్ ని డిజైన్ చేశాడట. చూద్దాం.
This post was last modified on September 22, 2023 1:46 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…