నేషనల్ సినిమా డే పేరుతో ఏడాదిలో ఓసారి మల్టీప్లెక్సులు సినీ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ ఆఫర్‌ను ప్రేక్షకులు బాగా ఉపయోగించుకున్నారు. రణబీర్ కపూర్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’కు నేషనల్ సినిమా డే భలేగా ఉపయోగపడింది. ప్రేక్షకులు ఈ ఆఫర్ వాడుకుని ఎగబడి చూశారీ సినిమాను. ఆ రోజు మల్టీప్లెక్సులన్నీ జనాలతో నిండిపోయాయి. ఈ ఏడాది కూడా ఈ ఆఫర్‌ను కొనసాగించబోతున్నాయి మల్టీప్లెక్స్ చైన్స్. ఈసారి అక్టోబరు 13న నేషనల్ సినిమా డేను పాటించబోతున్నాయి.
ఈ సందర్భంగా రూ.99 రేటుతో యూనిఫాం టికెట్ రేటును అమలు చేయబోతున్నాయి. అక్టోబరు 13న శుక్రవారం వస్తుంది. అంటే కొత్త సినిమాలు రిలీజయ్యే రోజు. కాబట్టి ప్రేక్షకులకు ఈ ఆఫర్ బాగానే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్, సినీపోలీస్, ఏషియన్, ముక్తా.. ఇలా నేషనల్ మల్టీప్లెక్స్ అసోషియేషన్లో భాగమైన అన్ని సంస్థలూ ఆ ఆఫర్‌ను అమలు చేయబోతున్నాయి. మల్టీప్లెక్సుల్లో రూ.200 నుంచి 400 వరకు వివిధ స్థాయిల్లో టికెట్ల ధరలు ఉంటాయి.
అలాంటి థియేటర్లలో రూ.99 రేటుతో సినిమా చూడటం అంటే మంచి అవకాశమే. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. ఇక్కడ సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం మల్టీప్లెక్సులు తమకు తాముగా రేట్లు తగ్గించడానికి వీల్లేదు. అలాగే తెలంగాణలో కూడా ఈ రేటు వర్తించదు కానీ.. అక్కడ ఇంకో 13 రూపాయలు అదనంగా చెల్లిస్తే చాలు. ఇక్కడ మినిమం రేటు రూ.112 ఉండాలి. అంతకంటే తక్కువ ధరకు టికెట్లు అమ్మడానికి ఇక్కడ నిబంధనలు అనుమతించవు. రూ.112 అంటే పెద్ద తేడా ఏమీ లేదు కాబట్టి సమస్య ఉండదు. దీపావళికి
Gulte Telugu Telugu Political and Movie News Updates