సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఫిలిం సెలబ్రెటీల్లో హరీష్ శంకర్ ఒకడు. ఊరూ పేరూ లేని వాళ్లు చేసే ట్వీట్లు, కామెంట్లను కూడా కొన్నిసార్లు ఆయన పట్టించుకుంటూ ఉంటాడు. తనదైన శైలిలో వాటికి రెస్పాన్స్ కూడా ఇస్తుంటాడు. ముఖ్యంగా తన సినిమాల గురించి ఏవైనా కామెంట్లు చేస్తే హరీష్ శంకర్ ఊరుకునే రకం కాదు.
అలాంటి పోస్టులు పెట్టేవారికి ఘాటుగా రిప్లై ఇస్తుంటాడు. నిన్న హరీష్ శంకర్ వినాయక చవితి శుభాకాంక్షలతో ఒక పోస్టు పెట్టాడు. దానిపై స్పందిస్తూ ఒక నెటిజన్.. “ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ 50 శాతం పూర్తయిందట కద అన్నా. ఇక క్వాలిటీ యా.. దేవుడి మీదే భారం వేశాం” అని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇది హరీష్‌కు ఒళ్లు మండేలా చేసింది.
“అంతే కదా తమ్ముడూ. అంతకుమించి ఏం నువ్వేమీ చేయగలవు చెప్పు?? ఈ లోగా కాస్త కెరీర్, ఉద్యోగం, చదువు మీద ఫోకస్ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు. ఆల్ ద బెస్ట్’’ అని ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని వాళ్లు.. సెలబ్రెటీల మీద ఎలా పడితే అలా కామెంట్లు చేయడం మామూలే.
చాలా వరకు సెలబ్రెటీలు ఇలాంటి కామెంట్లను పట్టించుకోరు. సోషల్ మీడియా సముద్రంలో ఇలాంటి వ్యక్తులు కోకొల్లలు. కానీ హరీష్ శంకర్ లాంటి వాళ్లు మాత్రం రాండమ్ కామెంట్ల మీద తమదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయానికి వస్తే.. ఇటీవలే పవన్ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ మధ్యలో రాజకీయ కార్యక్రమాల కోసం మళ్లీ బ్రేక్ తీసుకున్నాడు. తిరిగి ఇప్పుడూ షూట్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 20, 2023 4:01 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…