టాలీవుడ్లో ఒక కొత్త, వైవిధ్యమైన కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది. మాస్ రాజా రవితేజ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తొలిసారి జట్టు కట్టబోతోంది. గోపీచంద్ మలినేని కొత్త సినిమాలో వీరి కాంబినేషన్‌ను తెరపై చూడబోతున్నాం. రష్మిక.. ఇప్పటిదాకా చాలామంది స్టార్లతో సినిమాలు చేసింది కానీ.. అందులో చాలా వరకు క్లాస్ టచ్ ఉన్న చిత్రాలే. కానీ రవితేజ అంటూ పక్కా మాస్ ఉంటుంది.
గోపీచంద్‌తో అతడి కాంబినేషన్ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్.. ఇలా మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి. ‘క్రాక్’ తర్వాత మల్లీ వీరి కలయికలో సినిమాను అనౌన్స్ చేయగానే మంచి హైప్ వచ్చింది. ఈ చిత్రానికి కథానాయికగా పలు పేర్లను పరిశీలించారు. శ్రుతి హాసన్‌ను రిపీట్ చేయడం.. శ్రీలీలను తీసుకోవడం గురించి కూడా చర్చ జరగింది. కానీ చివరికి రష్మికను ఓకే చేశారు.
రష్మిక ఈ టైంలో నిజానికి నితన్ సరసన వెంకీ కుడుముల సినిమాలో నటించాల్సింది. కానీ ఓ హిందీ చిత్రం కోసం ఆమె ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తన డేట్లు కొన్ని వృథా అయ్యాయి. ఈలోపు నితిన్ సినిమాకు వేరే హీరోయిన్ని తీసుకున్నారు. ఇలాంటి టైంలోనే రవితేజ-గోపీచంద్ సినిమా నుంచి పిలుపు రావడంతో ఆమె సంతోషంగా ఒప్పుకుంది.
కారంచేడు ప్రాంతంలో జరిగిన ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ తరహాలోనే వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథను తీర్చిదిద్ది మంచి మాస్ సినిమాను అందించబోతున్నాడట గోపీచంద్ మలినేని. గోపీ చివరి సినిమా ‘వీరసింహారెడ్డి’ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ప్రి ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.
This post was last modified on September 20, 2023 3:58 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…