రాజమౌళి నుంచి ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతోందంటూ మూడు రోజుల కిందట వార్తలు వచ్చేసరికి అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఉత్కంఠకు తెరదించుతూ ‘మేడ్ ఇన్ ఇండియా’ పేరుతో తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు జక్కన్న. ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడు కాగా.. ఆయన తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరించనున్నాడు.
నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నాడు. ఇండియా సినిమాలో ఇప్పటిదాకా ఎన్నో బయోపిక్స్ చూశామని.. కానీ ఇది ఇండియన్ సినిమా బయోపిక్ అని చిత్ర బృందం ప్రకటించింది. ఐతే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రేక్షకుల్లో ఏమంత ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. అసలు ఇండియన్ సినిమాకు బయోపిక్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలిది ఫీచర్ ఫిలిమేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.
ఇండియన్ సినిమా పుట్టు పూర్వోత్తరాలు.. దాని ఎదుగుదల.. వేర్వేరు కాలాల్లో సినిమాల మేకింగ్, కథల పరంగా వచ్చిన మార్పులు చేర్పులు.. ఇలాంటి విషయాలను చర్చించే డాక్యుమెంటరీ టైప్ మూవీ అయి ఉంటుందని దీనిపై ఒక అంచనా కలుగుతోంది. ఇలాంటి ఫిలిమ్స్‌ను చిత్రోత్సవాల్లో ప్రదర్శించడానికి.. ప్రముఖులకు చూపించడానికి బాగానే ఉంటుంది.
కానీ.. సామాన్య ప్రేక్షకులకైతే ఇలా మన సినిమా చరిత్ర తెలుసుకోవాలని.. వెండితెరపై ఆ విశేషాలు చూడాలని అంత ఆసక్తి ఉండదు. రాజమౌళి సమర్పకుడు అయినా సరే.. వాటి మీద ఆసక్తి కలుగుతుందా అన్నది సందేహమే. అసలిది డాక్యుమెంటరీ టైప్ మూవీనా.. లేక రెగ్యులర్ ఫీచర్ ఫిలిం స్టయిల్లోనే ఇండియన్ సినిమా బయోపిక్‌ను కొత్త తరహాలో ప్రెజెంట్ చేస్తారా అన్న క్లారిటీ రావాల్సి ఉంది. రాజమౌళి బృందం ఆ క్లారిటీ ఇచ్చాకే ప్రేక్షకులకు దీనిపై ఎలాంటి ఆసక్తి ఉందో తెలుస్తుంది.
This post was last modified on September 20, 2023 2:37 pm
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…