ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం అని చెప్పకుండా అదే కథ ఆధారంగా ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేస్తాడని బలంగా వినిపిస్తోంది. మరి సీతగా నటించేది ఎవరు? అటు హిందీ వాళ్లకే కాకుండా దక్షిణాది ప్రేక్షకులు పరభాషా హీరోయిన్‍లా చూడని వాళ్లయితే బెటర్ అని ఓం రౌత్ భావిస్తున్నాడట.
అందుకే కియారా అద్వానీని ఈ పాత్రకు కన్సిడర్ చేస్తున్నాడట. కియారా అద్వానీ ఇప్పుడు నార్త్ ఇండియాలో హాట్ ఫేవరెట్. ఆమె తెలుగు వారికి కూడా సుపరిచితురాలే కనుక బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు. అయితే వీళ్లు సినిమా షూట్ ప్లాన్ చేస్తోన్న టైమ్‍కి కియారా డేట్స్ ఖాళీగా వున్నాయా లేదా అనేది తేలాల్సి వుంది. కాని పక్షంలో సీత పాత్రకు సూట్ అయ్యే ఫేస్ వున్న హీరోయిన్ కోసం అన్వేషిస్తారు.
మీడియాలో కొన్ని చోట్ల కీర్తి సురేష్‍తో సీత వేషం వేయిస్తే ఎలాగుంటుందని ప్రభాస్, ఓం రౌత్ మధ్య చర్చకు వచ్చినట్టు రాస్తున్నారు. రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే ప్రభాస్ ఈ షూటింగ్‍లో పాల్గొంటాడు. ఓం రౌత్ కేవలం రెండు నెలల సమయం మాత్రమే అడగడంతో నాగ్ అశ్విన్ కూడా అడ్డు చెప్పలేకపోయినట్టు సమాచారం.
This post was last modified on August 23, 2020 12:16 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…