Movie News

కొత్త ట్రైల‌రే సినిమాను లేపాలి

అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బోయ‌పాటి శ్రీను నుంచి వ‌స్తున్న సినిమా స్కంద‌. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌తో బోయ‌పాటి జ‌ట్టు క‌ట్ట‌డంతో ఈ సినిమాపై ముందు మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ సినిమా టైటిల్, టీజ‌ర్ లాంచ్ అయినంత వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కానీ ట్రైల‌ర్ లాంచ్ అయ్యాక ప‌రిస్థితి మారిపోయింది. మ‌రీ రొడ్డ‌కొట్టుడు స్ట‌యిల్లో ట్రైల‌ర్ సాగ‌డంతో జ‌నాల‌కు సినిమా మీద పెద్ద‌గా ఆస‌క్తి క‌ల‌గ‌లేదు.

బోయ‌పాటి మైండ్ లెస్ మాస్.. బాల‌య్య‌కు సెట్ అయిన‌ట్లు వేరే హీరోల‌కు సెట్ కాద‌న్న‌ది తెలిసిన సంగ‌తే. రామ్ విష‌యంలోనూ అదే జరిగిన‌ట్లు క‌నిపించింది ట్రైల‌ర్ చూస్తే. ఓవ‌ర్ ద టాప్ మాస్, యాక్ష‌న్, డ్రామా చూసి జ‌నాల‌కు సినిమా మీద నెగెటివ్ ఫీలింగ్ వ‌చ్చేసింది. 

దీనికి తోడు సినిమా నుంచి రిలీజ్ చేసిన ఏ పాటా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకోలేక‌పోయింది. లేటెస్ట్‌గా వ‌చ్చిన క‌ల్ట్ మామా పాట‌తోనూ త‌మ‌న్ నిరాశ ప‌రిచాడు. సినిమా అనుకున్న తేదీ నుంచి వాయిదా ప‌డ‌టం.. ప్ర‌మోష‌న్ల హ‌డావుడి త‌గ్గిపోవ‌డం కూడా మైన‌స్ అయి స్కంద‌కు హైప్ క్రియేట్ కాలేదు. ఐతే రిలీజ్ వీక్‌లో ఎలాగైనా హైప్ పెంచాల‌ని టీం చూస్తోంది.

ఇందులో భాగంగా కొత్త ట్రైల‌ర్ రెడీ చేస్తున్నార‌ట‌. ఈసారి ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఎలిమెంట్స్ జోడించే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది. ఆ ట్రైల‌ర్ వ‌చ్చాక సినిమా మీద అభిప్రాయం మారుతుంద‌ని ఆశిస్తోంది టీం. అలాగే రిలీజ్ వీక్‌లో ప్ర‌మోష‌న్లు కూడా గ‌ట్టిగా చేస్తార‌ట‌. కొత్త‌గా పెద్ద స్థాయిలో ఇంకో ఈవెంట్ కూడా చేస్తార‌ట‌. మొత్తంగా 28న సినిమా మంచి బ‌జ్ మ‌ధ్య రిలీజ‌య్యేలా.. భారీ ఓపెనింగ్స్ వ‌చ్చేలా ప్లానింగ్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

This post was last modified on September 20, 2023 10:15 am

Share

Recent Posts

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

28 minutes ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

37 minutes ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

37 minutes ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

3 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

3 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

4 hours ago