బాగా పేరున్న బేనర్లు ఎంత వేగంగా సినిమాలు తీసినా ఏడాదికి రెండో మూడో సినిమాలు వస్తాయి. కానీ ఒక బేనర్ నుంచి మూడు నెలల్లో ఐదు సినిమాలు రిలీజ్ కావడం మాత్రం అరుదైన విషయం. త్వరలోనే ఈ చిత్రం జరగబోతోంది. ప్రస్తుతం తెలుగులో పెద్ద బేనర్లలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోయే మూడు నెలల్లో ఐదు సినిమాలు రిలీజ్ కాబోతుండటం విశేషం. ఐతే ఇందులో ఒక సినిమా డబ్బింగ్ మూవీ కాగా.. ఇంకోటి తమ ఫ్యామిలీ బ్యానర్ భాగస్వామ్యంలోనే తీస్తున్నది.
ముందుగా సితార నుంచి దసరా కానుకగా ‘లియో’ రాబోతోంది. ఇది డబ్బింగ్ మూవీనే అయినప్పటికీ మంచి క్రేజ్ ఉంది తెలుగులో. విజయ్‌కి తెలుగులో హైయెస్ట్ గ్రాసర్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తర్వాతి నెలలో సితార నుంచి ‘ఆదికేశవ’ అనే మిడ్ రేంజ్ సినిమా రాబోతోంది. ఇందులో మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్‌తో శ్రీలీల జోడీ కట్టింది. నవంబరు 10న దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తర్వాతి నెలలో విశ్వక్సేన్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వస్తుంది. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీదా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక జనవరిలో తన బాబాయి సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ భాగస్వామ్యంలో సితార అధినేత నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న ‘గుంటూరు కారం’ రాబోతోంది.
ఈ చిత్రం సంక్రాంతికి షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న క్రేజీ మూవీ ‘టిల్లు స్క్వేర్’ కూడా ఈ మూడు నెలల్లోనే వస్తుంది. ఇంకా డేట్ ఖరారవ్వలేదు. రాబోయే కొన్ని వారాల్లోనే రిలీజ్ అనుకున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షణ్ పనుల్లో ఆలస్యం వల్ల రిలీజ్ కావట్లేదు. డిసెంబరు లేదా జనవరిలో ఈ చిత్రం విడుదల కావచ్చు. ఈ ఐదు చిత్రాల్లో ఏది ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో.. సితారను ఇవి ఏ స్థాయిలో నిలబెడతాయో చూడాలి.
This post was last modified on September 19, 2023 5:16 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…