తెలుగులో ఈ రోజు ఒక ఆసక్తికర చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆ సినిమా పేరు.. మార్టిన్ లూథర్ కింగ్. ఈ చిత్రంలో కమెడియన్ సంపూర్ణేష్ బాబు హీరో కావడం విశేషం. సంపూ హీరోగా హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ సినిమాలు చూశాం. వాటి వరకు అతను బాగానే సెట్ అయ్యాడు. కానీ రెగ్యులర్ కామెడీ రోల్స్ ఇస్తే సంపూ పెద్దగా మెప్పించలేకపోయాడు.
దీంతో ఒక దశ తర్వాత అతను కనుమరుగైపోయాడు. అలాంటి నటుడిని లీడ్ రోల్‌లో పెట్టి ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా తీశారు. పూజా కొల్లూరు ఈ చిత్రాన్ని రూపొందించగా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో పాటు ఒక ముఖ్య పాత్ర కూడా పోషించాడు. ఆల్రెడీ సినిమాను పూర్తి చేసి నేరుగా ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
‘మార్టిన్ లూథర్ కింగ్’ స్ట్రెయిట్ మూవీ కాదు. ఇదొక రీమేక్. తమిళంలో సూపర్ హిట్టయిన ‘మండేలా’ ఆధారంగా తెరకెక్కింది. ఒరిజినల్లో యోగి బాబు లీడ్ రోల్ చేశాడు. ఇది ఒక బార్బర్ కథ. ఒక ఊరిలో పంచాయితీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితుల్లో ఆ బార్బర్ ఓటే ఫలితాన్ని నిర్దేశించే పరిస్థితి వస్తుంది. అప్పటిదాకా అతణ్ని చాలా చిన్న చూపు చూసిన జనాలు.. తన ఓటు కీలకం కావడంతో అతణ్ని మహారాజులా చూసుకోవడం మొదలుపెడతాయి. చివరికి ఏమైందన్నది మిగతా కథ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూనే.. చివర్లో హృదయాన్ని మెలిపెట్టేలా ఉంటుందీ సినిమా.
తమిళంలో గత కొన్నేళ్లలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఇదొకటి. యోగిబాబు సూపర్ పెర్ఫామెన్స్‌తో మండేలా సినిమాను నిలబెట్టాడు. అతను కామెడీతో పాటు ఎమోషన్లను కూడా గొప్పగా పండించాడు. అలాంటి పాత్రకు సంపూను తీసుకోవడం అంటే సాహసమే. స్పూఫ్ కామెడీల వరకు ఓకే కానీ.. సంపూ ఇలాంటి పాత్రను పండించగలడా అన్నది ప్రశ్న. అతను మెప్పిస్తే మాత్రం సినిమా మంచి ఫలితాన్నందుకునే అవకాశముంది. అక్టోబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on September 19, 2023 2:31 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…