బిగ్‍బాస్ సీజన్ 4 మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఆల్రెడీ కంటెస్ట్లెను హోమ్ క్వారంటైన్‍కి పంపించారు. పధ్నాలుగు రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత వాళ్లంతా బిగ్‍బాస్ హౌస్‍లోకి వెళతారు. హౌస్‍లోకి వెళ్లే వాళ్లు తప్ప మరెవరూ వీరితో డైరెక్ట్గా కాంటాక్ట్ అవరు.
హోస్ట్ నాగార్జున కూడా వీరిని స్టేజీపై పరిచయం చేయబోవడం లేదు. అసలు ఈసారి ఎప్పటిలా ఆడియన్స్ ని ఆహ్వానించే స్టేజ్ వుండదు. మొత్తం ఇన్‍డోర్స్లోనే ప్లాన్ చేసారు. వివిధ సెలబ్రిటీలను షోకి ఆహ్వానించడం కూడా వుండదు.
కాకపోతే ప్రమోషన్స్ కోసం వచ్చే వారిని వీడియో కాల్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్ సభ్యులతో మాట్లాడిస్తారు. కుటుంబ సభ్యులను పిలిచే కార్యక్రమం కూడా వుండదు. అది కూడా వీడియో కాల్ ద్వారానే జరుగుతుంది. ఈసారి బిగ్ బాస్ షో రసవత్తరంగా వుండే అవకాశముంది.
ఎందుకంటే గతంలో బయటి వాళ్లు వచ్చి లీకులు ఇవ్వడంతో ఎవరు లీడింగ్‍లో వున్నారనేది హౌస్‍లో వాళ్లకు తెలిసిపోయేది. తదననుగుణంగా వారు తమ గేమ్ ప్లాన్ మారుస్తూ వుండేవాళ్లు. కానీ ఈసారి అలా లీక్స్ ఇచ్చే వీలుండదు. అలాగే బిగ్‍బాస్ ఎలిమినేషన్ సంగతులు కూడా ముందే లీక్ అయ్యే ఛాన్సుండదు.
This post was last modified on August 23, 2020 12:06 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…