Movie News

బ్లాక్‌బస్టర్ కొట్టాలా.. అతనే విలన్

ఎస్.జె.సూర్య అంటే ఒకప్పుడు దర్శకుడు మాత్రమే. వాలి, ఖుషి చిత్రాలతో దర్శకుడిగా అతను మామూలు సంచలనం రేపలేదు. ఐతే ‘నాని’ తమిళ వెర్షన్ ‘న్యూ’తో అనుకోకుండా అతను నటుడిగా మారాడు. నిజానికి ‘వాలి’లో నటించిన అజిత్‌నే ఈ చిత్రంలోనూ హీరోగా నటింపజేయాలనుకున్నాడు సూర్య. కానీ అజిత్‌కు కుదరకపోవడంతో అనుకోకుండా అతను హీరో అవతారం ఎత్తాడు.

ఆ చిత్రం పెద్ద హిట్ అయి సూర్యకు నటుడిగా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా స్వీయ దర్శకత్వంలో కొన్ని చిత్రాల్లో హీరోగా చేశాడు. అవేమీ పెద్దగా ఆడలేదు. కానీ సూర్య విలన్ వేషాలు వేయడం మొదలుపెట్టాక అతడి కెరీరే మారిపోయింది. తమిళంలో మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోయాడు. సూర్యలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో విలన్ పాత్రలతోనే తెలిసింది. అతను కొన్నేళ్లుగా టాప్ స్టార్ల సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నాడు. ఆ సినిమాలన్నీ భారీ విజయం సాధిస్తున్నాయి.

సూర్య ఏ స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్ర చేసినా.. ఆ చిత్రం ఆ హీరో కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అయిపోతుండటం విశేషం. విజయ్ సినిమా ‘మెర్శల్’లో విలన్ పాత్ర చేస్తే అది ఆ హీరో కెరీర్లో బిగ్టెస్ట్ హిట్ అయింది. అలాగే ‘శింబు’ సినిమా ‘మానాడు’, శివ కార్తికేయన్ మూవీ ‘డాన్’‌ల్లో సూర్య ప్రతినాయక పాత్రలు చేస్తే ఆయా హీరోల కెరీర్లలో అవి కూడా హైయెస్ట్ గ్రాసర్స్ అయ్యాయి. తాజాగా విశాల్ సినిమా ‘మార్క్ ఆంటోనీ’లో విలన్ పాత్ర చేశాడు సూర్య.

ఈ సినిమా విశాల్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. సినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో విశాల్ హైయెస్ట్ గ్రాసర్ అవడం లాంఛనమే అనిపిస్తోంది. ఈ చిత్రంలో విశాల్‌ను మించి సూర్య హైలైట్ అయ్యాడు. క్రేజీగా సాగిన అతడి పాత్ర, నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అతడి కోసమే జనం థియేటర్లకు వెళ్తున్నారు. సూర్య విలన్ పాత్రలు వరుసగా క్లిక్ అయి సినిమాలకు ప్లస్ అవుతుండటం.. పైగా హీరోల కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లు నమోదవుతుండటంతో సూర్యకు ఇంకా డిమాండ్ పెరిగిపోయేలా ఉంది.

This post was last modified on September 18, 2023 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉక్కు ‘సంకల్పం’పై ఇక డౌట్లు అక్కర్లేదు!

ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంటూ సాగుతున్న ప్రచారం ఇక దుష్ప్రచారం కిందే పరిగణించక తప్పదు. ఇకపై ఈ…

1 hour ago

సికందర్ ఫెయిల్యూర్.. ఆ హీరో ఫ్యాన్స్‌లో టెన్షన్

మురుగదాస్.. ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. రమణ, గజిని, గజిని (హిందీ), తుపాకి, కత్తి లాంటి బ్లాక్…

2 hours ago

ప్యాన్ ఇండియా నిర్మాతలూ….పారా హుషార్

అయిదారు నెలల క్రితం చిన్నగా మొదలై ఇప్పుడు శరీరమంతా పాకిన వ్యాధిగా మారిపోయిన హెచ్డి పైరసీ సికందర్ తో పతాక…

4 hours ago

బాలయ్యతో మళ్లీ విద్యాబాలన్?

విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…

9 hours ago

మోడీకి 75 ఏళ్లు.. రంగంలోకి ఆర్ ఎస్ ఎస్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబ‌రు 17తో 75 ఏళ్లు వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 74…

10 hours ago

రాబిన్ హుడ్ బాగానే దోచాడు.. కానీ

రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…

10 hours ago