సరిగ్గా ఇంకో పదే రోజుల్లో స్కంద విడుదల కానుంది. కౌంట్ డౌన్ పోస్టర్లు వదులుతున్నారు. సహజంగా ఇంత పెద్ద మూవీ చేయాల్సిన హడావిడి ఎందుకో దీనికి జరగడం లేదు. సినిమా మీద నమ్మకమో లేక పోటీ వీక్ గా ఉంది కాబట్టి గెలిచే తీరతామనే ధీమానో తెలియదు కానీ మొత్తానికి టీమ్ అయితే సైలెంట్ గానే ఉంది. రామ్, శ్రీలీల, బోయపాటి శీను ఇంకో రెండు మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు గట్రా మొదలుపెట్టబోతున్నారు. ప్రెస్ మీట్లు వగైరా ఎలాగూ ఉంటాయి. ఇవాళ కల్ట్ మామా స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ట్యూన్ పర్లేదు కానీ మరీ ఆహా ఓహో అనిపించే రేంజ్ అయితే కాదు.
కాంపిటీషన్ ని ఎంత తేలిగ్గా తీసుకున్నా స్కంద మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. చంద్రముఖి 2 ట్రైలర్ చూశాక దాని మీద నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చిన మాట వాస్తవం. పాత కథనే మళ్ళీ తీశారనే ఫీలింగ్ దర్శకుడు పి వాసు కలిగించినా ఊహించని సర్ప్రైజ్ లు సెకండ్ హాఫ్ లో చాలా ఉంటాయని అవే ఫలితాన్ని శాశించబోతున్నాయని చెన్నై వర్గాలంటున్నాయి. ఇక పెదకాపు 1 మీద విపరీతమైన బజ్ ఏమి లేదు కానీ ఇది కూడా షాక్ ఇచ్చేలానే ఉంటుందని అంటున్నారు. అలాంటప్పుడు స్కంద అలెర్ట్ గా ఉండటం అవసరం. కొత్త ట్రైలర్ ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పటికైతే స్పందన లేదు.
అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శీను చేస్తున్న సినిమాగా స్కంద పూర్తిగా మాస్ ప్యాకేజ్ గా రూపొందింది. ఇక వారియర్ డిజాస్టర్ నుంచి కోలుకున్న రామ్ మళ్ళీ ఇస్మార్ట్ రేంజ్ సక్సెస్ స్కందతోనే వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. విజువల్స్ గట్రా ఓవర్ మాస్ గానే ఉన్నాయి కానీ వినయ విధేయ రామ లాగా దెబ్బ కొట్టకపోతే చాలని రామ్ అభిమానులు కోరుకుంటున్నారు. వినాయక చవితి పండగను వదిలేసుకోవడం వల్ల కొంత మూల్యం చెల్లించిన స్కందకు ఆ లోటు తెలియకుండా ఉండాలంటే ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాల్సిందే. వేరే ఆప్షన్ లేదు.
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…