Movie News

అనిమల్ కంటెంట్ వణికించేలా ఉంటుందట

గదర్ 2, జవాన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా తర్వాత కొన్ని నెలల పాటు స్థబ్దుగా ఉండిపోయిన బిజినెస్ కి మంచి జోష్ ఇస్తూ గత కొన్ని నెలల్లో మంచి విజయాలే నమోదయ్యాయి. ఇప్పుడందరి చూపు డిసెంబర్ 1 విడుదల కాబోతున్న అనిమల్ మీదే ఉంది. రన్బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం క్రైమ్ థ్రిల్లర్ గురించి అంచనాలు మాములుగా లేవు. పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని, సత్యతో వర్మ సెట్ చేసిన స్టాండర్డ్ ని మించిపోయేలా ఒక కొత్త హీరోయిజంని చూస్తామని యూనిట్ తెగ ఊరిస్తోంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం అనిమల్ కంటెంట్ చాలా వయొలెంట్ గా ఉంటుందట. కాలేజీలో హీరో ఫిజిక్స్ లెక్చరర్ గా ఫస్ట్ హాఫ్ లో సాఫ్ట్ గా సాగి తండ్రి చనిపోయాక అత్యంత హింసాత్మకంగా మారే ట్రాన్స్ఫర్మేషన్ ఒళ్ళు గడుర్పొడిచేలాలా ఉంటుందట. సెన్సార్ అభ్యంతరాలు, బ్లర్లు భారీగా ఉంటాయని అంటున్నారు. అనిమల్ బిజినెస్ ఇంకా క్లోజ్ చేయలేదు. ఈ నెల 28న టీజర్ రిలీజ్ చేశాక ఒక్కసారిగా హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుందని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని టి సిరీస్ నిర్ణయించింది. ఇవాళ వినాయక్ చవితి సందర్భంగా వదిలిన పోస్టర్ లో రన్బీర్ ని డీసెంట్ గానే చూపించారు.

డిసెంబర్ లో తీవ్రమైన పోటీ ఉన్న నేపదాయంలో అనిమల్ రిలీజ్ కి ఎలాంటి పోటీ లేకుండా పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారు.  సలార్ రావొచ్చనే వార్తల నేపథ్యంలో ఒకవేళ అది జరిగినా కూడా వెనకడుగు వేయకూడదని దర్శక నిర్మాతలు డిసైడ్ చేసినట్టుగా తెలిసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ హై వోల్టేజ్ డ్రామాలో అనిల్ కపూర్ తండ్రిగా, బాబీ డియోల్ విలన్ గా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇది ఒక భాగమే ఉంటుందా లేక ట్రెండ్ ని ఫాలో అవుతూ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తారా అంటే ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే సందీప్ ఆల్రెడీ ప్రభాస్, అల్లు అర్జున్ లకు కమిట్ మెంట్స్ ఇచ్చాడు కాబట్టి అనిమల్ 2 రాదు. 

This post was last modified on September 18, 2023 12:41 pm

Share

Recent Posts

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

4 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

57 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

9 hours ago