అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మౌనంగా ఉన్నారు. ఏదో వివాదాస్పదంగా మాట్లాడితే ఇబ్బంది కాని సైలెంట్ గా ఉన్నా అదో పెద్ద ఇష్యూ అవుతోంది. నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ గురించి తారక్ ఇప్పటిదాకా స్పందించలేదు. సోషల్ మీడియాలో తన పేరుని కొందరు ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేయడం తెలిసి కూడా తొట్రుపాటు ప్రదర్శించడం లేదు. మరోవైపు డెవిల్ నిర్మాత దర్శకుడి మధ్య నెలకొన్న వివాదం అసలు పట్టించుకోనట్టు కళ్యాణ్ రామ్ ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లోనే టాక్ నడుస్తోంది.
వీటికి తోడు జూనియర్ ఇటీవలే దుబాయ్ లో జరిగిన సైమా అవార్డులు వేడుకకు వెళ్లడం ఇష్యూ మీద ఇంకొంచెం సీరియస్ ఫోకస్ పెట్టేలా చేసింది. నిజానికి బాబు అరెస్ట్ గురించి ఎవరైనా సరే మాట్లాడ్డం లేకపోవడమనేది వ్యక్తిగత విషయం. నందమూరి కుటుంబ సభ్యుడు కాబట్టి ఏదో ఒకటి చెప్పే తీరాలన్న గ్రౌండ్ రూల్ లేదు. ఆ మాటకొస్తే తారక్ నారా ఫ్యామిలీ కాదు కాదనేది అభిమానుల వాదన. ఇది అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి మనవళ్లుగా ఓ రెండు ముక్కలు చెబితే బాగుంటుందనేది కార్యకర్తల అభిప్రాయం. ఇక్కడ ఒక వర్గం వైపే వకాల్తా తీసుకోలేం.
ఇప్పటికిప్పుడు కాకపోయినా దగ్గరి భవిషత్తులో ఈ పరిణామం మీద మాట్లాడే సందర్భం వస్తుందని బ్రదర్స్ కి తెలుసు. ఆ మాత్రం ఊహించకుండా ఉండలేరు. దానికేం సమాధానం చెప్పాలో కూడా మనసులో ఉంటుంది. కానీ ఇప్పుడది బయట పెట్టరు. కేవలం సినిమాలే ప్రపంచంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ఏళ్ళ తరబడి టిడిపి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. కళ్యాణ్ రామ్ ముందు నుంచి వీటికి దూరమే. ఒకవేళ బాబాయ్ బాలకృష్ణకు ప్రత్యక్షంగా ఇలాంటి ఇబ్బంది ఏదైనా వచ్చి ఉంటే ఇలా ఉండేవారు కాదన్నది ఫ్యాన్సే ఒప్పుకుంటున్న వాస్తవం.
కాబట్టి దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి. టిడిపి జనసేన దోస్తీతో ఏపి రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. బాబు అరెస్ట్ మీద విదేశాల్లో, పక్కరాష్ట్రాల్లో సైతం నిరసన వస్తున్నప్పుడు తారక్, కళ్యాణ్ సరైన సమయం కోసం ఎదురు చూస్తుండొచ్చు. తమకు వ్యతిరేకంగా నోరు జారుతున్న కొందరు స్వంత అభిమానుల వైఖరి కళ్ళముందు కనిపిస్తున్నా ఇంత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారంటే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బదులు చెప్పేందుకు సిద్ధపడేనని అర్థం చేసుకోవాలి. అందుకే సైమా అవార్డు తీసుకున్నాక కూడా తారక్ దాని గురించి ట్వీట్ వేయలేదంటే ఇది తుఫాను ముందు ప్రశాంతతని మరికొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చూద్దాం.
This post was last modified on September 17, 2023 9:54 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…