నిన్న ముంబైలో జవాన్ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్ గా జరిగింది. క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరయ్యారు. ప్రత్యేకంగా బయట అతిథి ఎవరూ లేరు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ ఛాట్ చేసింది చిత్ర బృందం. అందులో భాగంగా అడిగిన ప్రశ్నకు హీరోయిన్ దీపికా పదుకునే సమాధానమిస్తూ ప్రాజెక్ట్ కె ప్రస్తావన తీసుకొచ్చింది. దాని షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నాననే సంగతి గుర్తు చేసుకుంటూ మాట్లాడింది. అప్పటిదాకా ఆమెనే నవ్వుతూ చూస్తున్న షారుఖ్ మొహంలో ఎక్స్ ప్రెషన్లు ఒక్కసారిగా కోపం తరహాలో ఇబ్బందిగా అనిపించాయి. ఆ వీడియో వైరలవుతోంది కూడా.
అలా చేయడానికి కారణాలు ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ కి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. డుంకీ కూడా ష్యుర్ షాట్ హిట్టనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అయితే వసూళ్ల పరంగా కింగ్ ఖాన్ ఇంత కష్టపడి సృష్టించిన రికార్డులు ఎవరైనా తేలిగ్గా బద్దలు కొట్టే ఛాన్స్ ఉందా అది ప్రభాసేనని వేరే చెప్పనక్కర్లేదు. సలార్ లేదా ప్రాజెక్ట్ కె ఏదో ఒకటి లేదా రెండు అది చేసే తీరతాయి. డిజాస్టర్ టాక్ వచ్చిన ఆదిపురుషే మొదటి వారంలో నాలుగు వందల కోట్లు లాగింది. ప్రభాస్ కెపాసిటీ హిందీలోనూ ఆ రేంజ్ లో ఉంటుంది.
ఇది తెలుసు కాబట్టే షారుఖ్ తన దగ్గర తెలుగు తమిళ సినిమాల ప్రస్తావన తెచ్చేందుకు ఇష్టపడడని ఇన్ సైడ్ టాక్. పుష్ప మూడు సార్లు చూసిన సంగతి అది ఆడుతున్న సమయంలో చెప్పి ఉంటే హెల్పయ్యేది కానీ నేషనల్ అవార్డు వచ్చి అల్లు అర్జున్ జవాన్ ని పొగిడాక చెప్పడం ఏమిటని బన్నీ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నించారు. అయినా బాహుబలి నుంచి ఖాన్ల అసంతృప్తి మనం చూస్తున్నదే. కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతారలు బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ కి ధీటుగా ఆడటం వాళ్ళు ఇన్ డైరెక్ట్ గా అయినా సరే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిగో ఇలాంటి సందర్భాల్లో బయట పడుతుంది.
This post was last modified on September 16, 2023 6:13 pm
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…