భారతీయ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు రాజ్ కుమార్ హిరాని. ఐతే 20 ఏళ్ల కెరీర్లో ఆయన తీసిన సినిమాల సంఖ్య మాత్రం కేవలం ఐదు. ఐతే రాశి కంటే వాసి ముఖ్యమని నమ్మే ఆయన.. తన ప్రతి చిత్రాన్నీ కళాఖండంగా మలిచారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, మున్నాభాయ్ లగేరహో, త్రీ ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా రాజ్‌కుమార్ హిరాని తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగించింది. ఐతే ‘మున్నాభాయ్’ సిరీస్‌లోె రెండు సినిమాలు తీసిన హిరాని.. మూడో చిత్రం కూడా తీయొచ్చనే ప్రచారం ఎప్పట్నుంచో నడుస్తోంది. కానీ అది ఎంతకీ కార్యరూపం దాల్చట్లేదు. ఐతే మున్నాభాయ్-3 త్వరలో వచ్చేస్తోందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. హిరాని తర్వాతి సినిమా ఇదే అంటున్నారు.
సంజయ్ దత్ మున్నాభాయ్ లుక్‌లో కనిపిస్తున్న కొత్త వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటమే ఇందుక్కారణం. ఐతే వాస్తవం ఏంటంటే.. షారుఖ్ ఖాన్‌తో తాను తీస్తున్న కొత్త సినిమా ‘డుంకి’లో సంజయ్ దత్‌ను కూడా నటింపజేస్తున్నాడు హిరాని. ఇందులో సంజు మున్నాభాయ్ క్యారెక్టర్లోనే కనిపించనున్నాడు. తనతో పాటు ఏటీఎం క్యారెక్టర్ చేసిన అర్షద్ వార్సి కూడా క్యామియో రోల్‌లో తళుక్కుమనబోతున్నాడు.
దీనికి సంబంధించిన ఆన్ లొకేషన్ వీడియోలోనే ఇద్దరూ సందడి చేశారు. కానీ మున్నాభాయ్ గెటప్‌లో సంజు కనిపించడంతో హిరాని మున్నాభాయ్-3తో వస్తున్నాడని జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజానికి ‘మున్నాభాయ్-3’ కోసం గతంలో సన్నాహాలు జరిగినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. మున్నాభాయ్-2 వచ్చి దశాబ్దంన్నర దాటిపోగా.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయడం కరెక్ట్ కాదని, ఆ ప్రాజెక్ట్‌ను దాదాపుగా డ్రాప్ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 16, 2023 2:34 pm
సుపరిపాలనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిది అందె వేసిన చెయ్యి. ప్రజలకు మెరుగైన పాలన అందించే విషయంలో నిత్యం…
పెద్ద సినిమాలకు విడుదల తేదీ దోబూచులాటలు తప్పడం లేదు. ముందు ఒక డేట్ అనుకోవడం, తర్వాత దానికి కట్టుబడలేక మార్చుకోవడం,…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు చేబ్రోలు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ అధినేత,…
ప్రభుత్వం అంటే ఇదీ.. అంటూ జాతీయ మీడియా ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలో ఉన్న కూటమి సర్కారుపై ప్రశంసలు గుప్పించింది. నేటితో…
టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా పేరుగాంచిన గూగుల్… వరుసబెట్టి ఉద్యోగులను ఇంటికి పంపేస్తోంది. 2023 నుంచి గూగుల్ లో…