నిన్న విడుదలైన మార్క్ ఆంటోనీ తమిళనాడులో మంచి జోరు చూపిస్తోంది. తెలుగులో మిక్స్డ్ టాక్ తో పాటు ఆశించిన స్థాయిలో స్పందన లేనట్టుగా కనిపిస్తున్నా పోటీ మరీ వీక్ గా ఉండటంతో ఈ వారాంతం మాస్ పుణ్యమాని మంచి వసూళ్లే దక్కేలా ఉన్నాయి. దీని సంగతి పక్కనపెడితే ప్రమోషన్లలో బాగా హై లైట్ చేసుకున్న అంశాల్లో నిన్నటి తరం ఐటెం బాంబ్ సిల్క్ స్మితని విఎఫ్ఎక్స్ ద్వారా రీ క్రియేట్ చేయడం. దగ్గరి పోలికలున్న ఆర్టిస్టుతో సీన్ నటింపజేసి ఆ తర్వాత సిల్క్ ఫేస్ ని మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా మిక్స్ చేసి ఒరిజినల్ ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఐడియా బాగానే ఉంది కానీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ విషయంలో పొరపాట్లు చాలానే చేశారు. మొదటిది కథ నడిచే కాలం 1975గా చూపిస్తారు. అప్పటికే సిల్క్ స్మిత పరిశ్రమలో స్టార్ గా ఎదిగినట్టు, విశాల్ సహాయం కోరినట్టు ఒక ఎపిసోడ్ డిజైన్ చేశారు. కానీ ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిందే 1979లో. పెద్ద స్థాయికి చేరుకోవడానికి నాలుగైదేళ్లు పట్టింది. అలాంటప్పుడు ఈ సీన్ నాన్ సింక్ కిందకు వస్తుంది. సరే ఇది పోన్లే అని వదిలేస్తే సిల్క్ స్మితని సరైన రీతిలో వాడుకోలేదు. పేలవమైన సీన్ తో చప్పగా తేల్చేశారు. ఒక పాట ఉంటుందని ఆశించిన ఓల్డ్ ఏజ్ అభిమానులు నిరాశ పడ్డారు.
గతంలో వెంకటేష్ కలిసుందాం రా, తారక్ యమదొంగలో స్వర్గీయ ఎన్టీఆర్ ని గ్రాఫిక్స్ ద్వారా ఎలా జొప్పించి మెప్పించారో చూశాంగా. సిల్క్ స్మిత పాత్రను కూడా ఆ రేంజ్ లో ఊహించుకుంటే ఇలా తుస్సుమనిపించారు. బడ్జెట్ పరిమితుల వల్లనో లేక ఒక్క సీన్ కనిపిస్తే చాలు జనం వెర్రెక్కిపోతారనో తెలియదు కానీ మొత్తానికీ సన్నివేశం తేలిపోయింది. గత కొన్నేళ్లలో పోలిస్తే మార్క్ ఆంటోనీకి వచ్చిన ఓపెనింగ్ విశాల్ కి బెస్ట్ అనిపించేలా ఉంది. తమిళ వెర్షన్ బ్రేక్ ఈవెన్ మొదటి వారంలోనే అయిపోతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. తెలుగు డబ్బింగ్ మాత్రం అంత సీన్ లేదనిపిస్తోంది.
This post was last modified on September 16, 2023 12:54 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…