Movie News

ఇక్క‌డ ప‌వ‌న్‌ను, అక్క‌డ అజిత్‌ను వాడేశారు

త‌మిళంలో స్టార్ హీరోగా ఎదిగిన విశాల్‌కు ఒక‌ప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగే ఉండేది. కానీ వ‌రుస‌గా త‌న సినిమాలు ఫ్లాప్ కావ‌డం.. పైగా అవి రొటీన్ మాస్ మ‌సాలా సినిమాలే కావ‌డంతో త‌న ఫాలోయింగ్, మార్కెట్ దెబ్బ తిన్నాయి. ఈ మ‌ధ్య త‌న సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. ఐతే విశాల్ కొత్త చిత్రం మార్క్ ఆంటోనీ మాత్రం క్రేజీ ట్రైల‌ర్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే మాంచి ఎంట‌ర్టైన‌ర్ లాగా క‌నిపించింది. శుక్ర‌వారం రిలీజైన సీనిమాకు టాక్ ప‌ర్వాలేద‌న్న‌ట్లే వ‌చ్చింది. అనుకున్న‌ట్లే ఈ సినిమాలో కామెడీ బాగా పండింది. ముఖ్యంగా ఎస్.జె.సూర్య పాత్ర‌.. అత‌డి పెర్ఫామెన్స్.. త‌న‌తో ముడిప‌డ్డ కామెడీ సీన్లు సూప‌ర్ అనే టాక్ వ‌స్తోంది. కాక‌పోతే సినిమా మ‌రీ లౌడ్‌గా ఉండ‌టమే అభ్యంత‌ర‌క‌రంగా అనిపించింది చాలామందికి.

కొంచెం కుదురుగా.. ప‌ద్ధ‌తిగా సినిమా సాగి ఉంటే మార్క్ ఆంటోనీ స్పెష‌ల్ మూవీ అయ్యేది. సినిమాలో విజిల్ వ‌ర్తీ మూమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. అందులో సిల్క్ స్మిత రీక్రియేష‌న్ సీన్ ఒక‌టి. ఇది కాక తెలుగులో టాప్ స్టార్ల‌లో ఒక‌రైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెఫ‌రెన్స్ ఒక చోట మ‌న ప్రేక్ష‌కుల్లో హుషారు పుట్టించింది. ఈ క‌థ 90వ ద‌శ‌కంలో న‌డుస్తున్న‌ట్లుగా చూపించి.. విల‌న్ ఫ్యామిలీ మెంబ‌ర్ ఒక‌రు సినిమా ఆడిష‌న్స్‌కు వెళ్తే.. వేరే కుర్రాడిని తీసుకున్న‌ట్లు చెబుతాడు.

త‌న పేరు పి తో మొద‌ల‌వుతుంద‌ని చెబుతూ.. త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెబుతాడు. అది విని భ‌విష్య‌త్తులో ఈ పేరు అంద‌రినీ ఆలోచింప‌జేస్తుంద‌ని ఎస్.జె.సూర్య అన‌డంతో థియేట‌ర్ హోరెత్తింది. ఇక్క‌డ ప‌వ‌న్ పేరు వాడిన‌ట్లే.. త‌మిళంలో అజిత్ కుమార్ రెఫ‌రెన్స్ పెట్టారు. అక్క‌డ రెస్పాన్స్ ఇంకా పెద్ద రేంజిలోనే ఉంది. ఈ సీన్‌కు థియేట‌ర్లలో సంద‌డి నెల‌కొన్న వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

This post was last modified on September 16, 2023 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబు, జగన్… విదేశాలకు ఇద్దరూ ఒకేసారి

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……

3 hours ago

భన్సాలీతో బన్నీ – ఏం జరుగుతోంది ?

సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…

8 hours ago

ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ‌.. !

డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్ప‌లు మామూలుగా ఉండ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా..…

9 hours ago

తిరుప‌తి తొక్కిస‌లాట‌: జ‌గ‌న్ కామెంట్స్ ఇవే!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌కు భ‌య‌ప‌డుతోంద‌ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌కు భ‌య‌ప‌డుతున్న…

10 hours ago

ఒకే చోట ప‌వ‌న్‌-జ‌గ‌న్ ఎదురు పడ్డ వేళ‌!

ఏపీ రాజ‌కీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్య‌వ‌హ‌రించే జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌లు…

10 hours ago

క్షమించండి… పబ్లిక్ గా సారీ చెప్పిన పవన్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…

11 hours ago