కరోనా వల్ల థియేటర్లు ఐదు నెలలకు పైగా మూత పడి ఉండటం, సమీప భవిష్యత్తులో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో బాలీవుడ్లో భారీ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నారు. కానీ సౌత్ నిర్మాతలు మాత్రం ఈ విషయంలో తటపటాయిస్తూ వచ్చారు. ఇక్కడ చిన్నా చితకా సినిమాలే ఇలా రిలీజయ్యాయి. కానీ ఇప్పుడు దక్షిణాది నిర్మాతల ఆలోచనలు మారిపోతున్నాయి.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పట్టు వీడి తన నిర్మాణంలో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘వి’ని సెప్టెంబరు 5న అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇంతలో ఇప్పుడు ఓ భారీ తమిళ చిత్రాన్ని కూడా ప్రైంలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటన రావడం విశేషం. అది.. సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రం అక్టోబరు 30న అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.
కరోనా లేకుంటే వేసవిలోనే విడుదల కావాల్సిన సినిమా ‘ఆకాశమే నీ హద్దురా’. ఎప్పుడు పరిస్థితులు బాగు పడితే అప్పుడు సినిమాను విడుదల చేద్దాం అని చూసింది సూర్య అండ్ టీం. కానీ కానీ ఆ అవకాశం ఇప్పుడిప్పుడే రాదని తేలిపోయింది. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదని తెలిసినా.. ఈ చిత్రానికి ఈ మధ్య సెన్సార్ చేయించేయడం ఆశ్చర్యం కలిగించింది. అంతే కాదు.. రిలీజింగ్ సూన్ అంటూ తమిళ పీఆర్వోలు సోషల్ మీడియాలో అప్ డేట్లు కూడా ఇచ్చారు. దీన్ని బట్టి ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తారేమో అన్న సందేహాలు కలిగాయి. ఇప్పుడు ఆ అనుమానమే నిజమైంది.
అక్టోబరు 30న ఈ చిత్రాన్ని ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు సూర్య స్వయంగా ప్రకటన ఇచ్చాడు. వినాయక చవితి శుభదినాన దీనిపై ప్రకటన చేశాడు. ఇంతకుముందు సూర్య భార్య జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని ఇలాగే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు థియేటర్ల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వచ్చినా సూర్య పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా తాను హీరోగా నటించిన భారీ చిత్రాన్ని ప్రైంలో వదిలేస్తున్నాడు. తెలుగమ్మాయి సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది.
This post was last modified on August 22, 2020 6:43 pm
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల…